లాడ్జిలో మహిళను హత్య చేసి.. పరారైన యువకుడు | Police found a womas dead body in Vijaywada Krishna Lanka Lodge | Sakshi
Sakshi News home page

లాడ్జిలో మహిళను హత్య చేసి.. పరారైన యువకుడు

Nov 13 2026 6:28 PM | Updated on Nov 13 2026 6:32 PM

Police found a womas dead body in Vijaywada Krishna Lanka Lodge

విజయవాడ: కృష్ణలంక రామయ్య లాడ్జిలో మహిళా దారుణ హత్య.కు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన ఎర్రమ్మ అనే మహిళ..అదే యువకుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. 

వివరాల్లోకి వెళితే.. తన భార్య రెండు రోజులుగా కనిపించడం లేదని సూర్యారావుపేట స్టేషన్‌లో  ఆమె భర్త ఫిర్యాదు చేశాడు.  సదరు మహిళ భర్త ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. ఈరోజు కృష్ణలంక రామయ్య లాడ్జిలో మహిళ దారుణ హత్యకు గురైన విషయాన్ని కనుగొన్నారు. బస్టాండ్‌ ఎదురుగా ఉన్న రామయ్య లాడ్జిలో ఆ మహిళ విగత జీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు.

అయితే ఆ మహిళను హత్య చేసిన తర్వాత ఆ యువకుడు లాడ్జి గదికి తాళం వేసి పరారయ్యాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కృష్ణలంక, సూర్యారావుపేట పోలీసులు.. పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

ఇదీ చదవండి:  5.6 అడుగుల అమ్మాయిలే కావాలి.. శరీరంపై మచ్చలు ఉండకూడదు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement