చంద్రబాబు సొంత జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు: కల్పలతారెడ్డి | Students took to the streets in Chandrababus own district Kalpalatha Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సొంత జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు: కల్పలతారెడ్డి

Nov 13 2026 3:22 PM | Updated on Nov 13 2026 3:28 PM

Students took to the streets in Chandrababus own district Kalpalatha Reddy

తాడేపల్లి: చంద్రబాబు నాయుడి సొంత జిల్లాలోనే విద్యార్థులు రోడ్డెక్కారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కూటమి ప్రభుత్వానికి ముఖ్యం కాదా? అని అన్నారు. 

పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎ‍స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలలు కన్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వసతి దీవెన, విద్యాదీవెన పెండింగే లేదని తెలిపారు. విద్యార్థుల సమస్యల గురించి మంత్రి లోకేశ్‌కు తెలియదా అని కల్పలతారెడ్డి ప్రశ్నించారు.

‘‘విద్యార్థులను కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. చిన్న వర్షానికే నీట మునిగే అమరావతికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ, విద్యార్థులకు మాత్రం ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించటం లేదు. అమరావతి అద్దాల విలువ కూడా విద్యార్థులకు లేదా? 

వైఎస్ జగన్ హయాంలో సమయం ప్రకారం రియింబర్స్‌మెంట్ ఇచ్చారు. కానీ, చంద్రబాబు వచ్చాకే ఫీజు రియింబర్స్‌మెంట్ ఎగ్గొట్టారు. పేద కుటుంబంలంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపు? మంత్రి నారా లోకేశ్‌కు విద్యార్థుల సమస్యలు పట్టవా?  స్టూడెంట్స్ కు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రావటం ఆందోళన కలిగిస్తోంది. 

చంద్రబాబు ఫీజులు చెల్లిస్తే ఈ సమస్య వచ్చేదే కాదు. విద్యార్థులను వేధిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. ఫీజు రియింబర్స్‌మెంట్, విద్యా దీవెన నిధులను వెంటనే రిలీజ్ చెయాలి. ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వం ప్రకటించాలి. వైఎస్ జగన్ విద్యార్థులకు బంగారు బాట వేస్తే, చంద్రబాబు వారి భవిష్యత్తును నాశనం చేశారు’’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement