చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్‌ | Internal Rift In TDP, Five Senior Leaders Quit Party In Chandragiri Over MLA Pulivarthi Nani Leadership, Resign Letter Goes Viral | Sakshi
Sakshi News home page

చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్‌

Nov 13 2026 10:15 AM | Updated on Nov 13 2026 10:46 AM

Five Senior Leaders Resign To TDP Party

చినబాబుతో బిరుదాల భాస్కర్‌రెడ్డి

తిరుపతి రూరల్‌: చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఐదుగురు సీనియర్‌  నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు గురువారం లేఖ రాశారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు గౌరవం, గుర్తింపు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తల పట్ల చులకన భావంతో మాట్లాడుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నట్టు వాపోయారు. 

మూడు దశాబ్దాల తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీని గెలిపించుకుంటే.. ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుటుంబీకుల వ్యవహారశైలి కారణంగా మరో 30 ఏళ్లపాటు పార్టీ చంద్రగిరి నియోజకవర్గంలో గెలవలేని పరిస్థితి ఏర్పడిందని ఆ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆరు జెడ్పీటీసీలకు మూడు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇది టీడీపీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదని, ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారశైలికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. రాజీనామా లేఖలో సంతకం చేసిన వారిలో తిరుపతి రూరల్‌ మండల టీడీపీ మాజీ కార్య దర్శి బిరుదాల భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సరస్వతి, టీడీపీ సీనియర్‌ నేతలు ఎస్‌.వెంకటేష్‌ నాయుడు, టి.లక్ష్మినారాయణ, పి.మనోహర్‌ ఉన్నారు.

ఇదీ చదవండి: ‘నీ ఇష్టం వచ్చింది చేసుకో’..!

టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు టీడీపీ సీనియర్‌ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖ   


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement