‘రాప్తాడు’ బాలికలకు వైఎస్సార్‌సీపీ అండ | YSRCP Financial Assistance To Student Lakshmi | Sakshi
Sakshi News home page

‘రాప్తాడు’ బాలికలకు వైఎస్సార్‌సీపీ అండ

Nov 13 2026 9:47 AM | Updated on Nov 13 2026 9:47 AM

YSRCP Financial Assistance To Student Lakshmi

అనంతపురం: రాప్తాడు ఘటనలో గాయపడిన బాలికలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. విద్యార్థిని గోపికను రక్షించే ప్రయత్నంలో  గాయపడిన లక్ష్మీని ఇటీవల పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించి ఆమె కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం ఆస్పత్రికెళ్లి లక్ష్మీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. అలాగే బెంగళూరులో చికిత్స పొందుతున్న గోపిక కుటుంబానికి కూడా వైఎస్సార్‌సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకాష్‌రెడ్డి తెలిపారు. బాధిత బాలికలు, వారి కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  

ఇదీ చదవండి: ముక్కా శ్రావణిని డమ్మీ చేసే వ్యూహం?


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement