4 కార్పొరేషన్లలో 26న పోలింగ్‌ | Notification to be issued today for panchayats going to polls in the first phase | Sakshi
Sakshi News home page

4 కార్పొరేషన్లలో 26న పోలింగ్‌

Nov 13 2026 5:46 AM | Updated on Nov 13 2026 5:46 AM

Notification to be issued today for panchayats going to polls in the first phase

19 మున్సిపాలిటీల్లోనూ అదే రోజు ఎన్నికలు

రేపటి నుంచి సోమవారం వరకు నామినేషన్లు 

తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు నేడు నోటిఫికేషన్‌ 

ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠ వెల్లడి 

సాక్షి, అమరావతి: కోర్టు కేసుల కారణంగా తొలి విడతలో ఎన్నికలు జరగని నాలుగు నగరపాలక సంస్థలు సహా 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ నెల 26న పోలింగ్‌ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ ప్రకటించారు. గురువారం మలివిడత మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం 15 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతాయని విజయవాడలో మీడియాకు వెల్లడించారు. 4 మేయర్, 19 మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులతో పాటు 1,109 డివిజన్, వార్డులకు ఈ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. వీటికి శనివారం నుంచి సోమవారం వరకు నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు. 30న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 

ఈ నగరాలు, పట్టణాల డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవుల పరోక్ష ఎన్నికలు డిసెంబర్‌ 5న జరుగుతుందని, ఆ రోజు వాయిదా పడితే 6న నిర్వహిస్తామని చెప్పారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు పోలీసు భద్రత, ఎస్కార్ట్‌ ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అవసరమైన చోట అదనపు నామినేషన్‌ కేంద్రాలు, అవసరాన్ని బట్టి జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనిపై పూర్తి నిర్ణయాధికారం జిల్లాల కలెక్టర్లదేనన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డాక్టర్‌ ఎ.మల్లికార్జున, ఐజీ బి.రాజకుమారి, మున్సిపల్‌ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ రవీంద్రబాబు పాల్గొన్నారు.   

ఎంపీలు, ఎమ్మెల్యేకు ఒక్క చోటే ఓటు 
తొలి విడత మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లు, పట్టణాల్లో జరిగే డిప్యూటీ మేయర్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి పరిధిలోని ఏదో ఒక పట్టణాన్ని ఎంపిక చేసుకుని, ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పునేఠ చెప్పారు. గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ఆయన మాట్లాడారు. 

రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులకు వారి ఎన్నిక సమయంలో ఎక్కడైతే ఓటరుగా నమోదై ఉంటారో ఆ పట్టణ స్థానిక సంస్థలో మాత్రమే ఎక్స్‌ అఫీషియో హోదాలో ఓటుహక్కు ఉంటుందని తెలిపారు. 10వేల కంటే తక్కువ జనాభా ఉన్న రెండు నుంచి నాలుగు గ్రామ పంచాయతీలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, అందులోని ప్రధాన లేదా అనువైన పంచాయతీలో నామినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీ కార్యదర్శి మల్లికార్జున్‌ సూచించారు. 

23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌..
ఈ నెల 14: రిటర్నింగ్‌ అధికారులు/ఎలక్షన్‌ అధికారులు ఎన్నికల నోటీసు జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం 
ఈ నెల 16:    నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 
ఈ నెల 17:    నామినేషన్ల పరిశీలన 
ఈ నెల 19: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ,తుది అభ్యర్థుల జాబితా ప్రకటన 
ఈ నెల 26: పోలింగ్‌ 
ఈ నెల 27: రీపోలింగ్‌ 
ఈ నెల 30: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన 

ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు : శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి–తాడేపల్లి. 
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు: ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బీ.కొత్తకోట

షెడ్యూల్‌ ప్రకారమే మూడు దశల పంచాయతీ ఎన్నికలు.. 
ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో కొనసాగుతాయని, ఈమేరకు ఏర్పాట్లు చేశామని పునేఠ స్పష్టం చేశారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు తెలిపారు. ప్రతి దశలోనూ పోలింగ్‌ రోజునే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని చెప్పారు. 
మొదటి దశ:    ఈ నెల 13న నోటిఫికేషన్, 26న పోలింగ్‌ 
రెండో దశ  : ఈ నెల 16న నోటిఫికేషన్, 29న పోలింగ్‌ 
మూడో దశ : ఈ నెల 19న నోటిఫికేషన్, డిసెంబర్‌ 2న పోలింగ్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement