వేల యూనిట్ల రక్తం ఏమైంది? | Complaint to the President and the Union Health Ministry alleging major irregularities in blood distribution | Sakshi
Sakshi News home page

వేల యూనిట్ల రక్తం ఏమైంది?

Nov 13 2026 5:18 AM | Updated on Nov 13 2026 5:18 AM

Complaint to the President and the Union Health Ministry alleging major irregularities in blood distribution

టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో 7,439 యూనిట్ల రక్త సేకరణ 

పలు ఆసుపత్రులకు పంపిణీ చేసింది 3,246 యూనిట్లు 

నేటికీ లెక్కతేలని మిగిలిన 4,193 యూనిట్ల రక్తం  

రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేత 

విచారణకు కేంద్రం ఆదేశం

కళ్యాణదుర్గం: రక్తదాన శిబిరం వెనుక భారీ కుంభకోణం దాగుందా? సేవ ముసుగులో వేల యూనిట్ల మానవ రక్తాన్ని అక్రమంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించారా అనే ప్రశ్నలు ఇప్పుడు కళ్యాణదుర్గం అంతటా వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 20న చంద్రబాబు జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబి­రం నిర్వహించి 7,439 మంది దాతల నుంచి రక్తాన్ని సేకరించినట్లు ప్రకటించారు. ఈ రక్తం పంపిణీలో భారీ అ­వక­తవకలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ కళ్యా­ణదుర్గం మునిసిపల్‌ విభా­గం కన్వీనర్‌ ఐ.సుధీర్‌ ఆరోపించారు. 

ఆయన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)ద్వారా సేకరించిన వివరాల ప్రకారం 7,439 యూనిట్ల రక్తంలో రెడ్‌ క్రాస్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు(ఆర్డీటీ) ఆసు­పత్రులు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లకు కలిపి 3,246 యూనిట్ల రక్తం మాత్రమే అందజేశారు. మిగిలిన 4,193 యూనిట్ల రక్తం ఎక్కడికి చేరింది అనేది తేలాల్సి ఉంది. బళ్లారి, బెంగళూరుతో పాటు కర్ణాటకలో­ని మరికొన్ని ప్రాంతాలకు, హైదరాబాద్‌కు అక్రమంగా తరలివెళ్లిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్రపతికి ఫిర్యాదు..రంగంలోకి కేంద్రం  
రక్తదాతల త్యాగాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని ఇతర రాష్ట్రాలకు రక్తాన్ని అక్రమంగా రవాణా చేశారంటూ ఐ.సుధీర్‌ రా­ష్ట్రపతికి, కేంద్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశా­రు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన కేంద్ర ఆ­రో­గ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గ­త నెల 31న విచారణకు ఆదేశించింది. ఈ మే­రకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ మానస్‌ ప్ర­తి­మ్‌ రాయ్‌ ఏపీ స్టేట్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ప్యూజన్‌ కౌ­న్సి­ల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌కు లేఖ రాసి దీనిపై విచా­ర­ణ చేసి 2 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement