సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండంగా మారిన తర్వాత దిశ మార్చుకుని తుపానుగా బలపడేందుకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తుపానుగా మారితే కోస్తాంధ్రపై మరోసారి ప్రభావం పడనుంది.
సముద్రంలో తుపాన్‌గా ఏర్పడి తీరానికి దగ్గరగా వచ్చేసరికి బలహీన పడవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. తుపాను లేదా తీవ్ర వాయు గుండంగానే తీరాన్ని దాటినా భారీ వర్షాల ముప్పు కలిగే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల ఉధృత గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదీ చదవండి: ధరల 'దరువు'!


