breaking news
kalpalatha reddy
-
టీడీపీకి ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారు
-
అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి
సాక్షి, అమరావతి: అసమర్థ విధానాలతో కూటమి ప్రభుత్వం టీచర్లలో అలజడి సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. ‘విద్యార్థి, ఉపాధ్యాయుల రేషియోలో అశాస్త్రీయ విధానం కారణంగా దాదాపు 10 వేల మంది స్కూల్ అసిస్టెంట్లను సర్‌ప్లస్‌గా చూపే పరిస్థితి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకువచి్చన సంస్కరణలను కక్షతోనే నిర్విర్యం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా రంగాన్ని బతికించాలంటూ వీధుల్లోకి వచ్చి పోరాడే దుస్థితి తెచ్చారు. 117 జీఓను రద్దు చేస్తూ, దానికి బదులుగా తెచ్చిన 19, 20, 21 జీవోల వల్ల ప్రైమరీ స్కూళ్లకు ఎటువంటి మేలు జరగడం లేదు. ఇదివరకు ఉన్న ఆరు రకాల స్కూళ్లను నాలుగింటికి తగ్గిస్తామని చెప్పి.. తొమ్మిదికి పెంచారు.ఉపాధ్యాయుల్లో అయోమయ పరిస్థితి. వైఎస్ జగన్ టీచర్లకు పదోన్నతులు ఇస్తే, కూటమి ప్రభుత్వం వారికి డిమోషన్స్ ఇస్తోంది. ఒకవైపు మిగులు టీచర్లను చూపుతూ, మరోవైపు డీఎస్సీలో కొత్త టీచర్ పోస్ట్‌లను ఎలా భర్తీ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీలో పోస్ట్‌లను తగ్గించేందుకే ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల రేషియోను 1-53 కాకుండా 1-40 ప్రకారం తీసుకోవాలి. సెకండ్ సెక్షన్ కూడా హైసూ్కల్‌కు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి. సబ్జెక్ట్ టీచర్లను పక్కకు పెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలి’. -
‘చంద్రబాబు నిర్వాకం.. పదివేల మంది టీచర్లకు డిమోషన్’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. సీఎం చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని అన్నారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యారంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది. టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు. వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి.ఒకవైపు సర్ప్లస్ చూపిస్తూ మరోవైపు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు?. గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుంది?. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దు’ అంటే వ్యాఖ్యలు చేశారు. -
ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కల్పలతారెడ్డి మేనకోడలు భూమిక దుర్మరణం చెందారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సానుభూతి తెలిపారు. -
సీఎం జగన్‌తోనే విద్యాభివృద్ధి
పటమట(విజయవాడతూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాభివృద్ధికి కంకణం కట్టుకుని పేద విద్యార్థుల భవిష్యత్ కోసం అహరి్నశలు శ్రమిస్తున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–1998 వారికి ఉద్యోగాలు, వేలాదిమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు నాడు–నేడు, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి యోధుడిలా కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరింత మేలు కలిగేందుకు ఉపాధ్యాయులందరూ సీఎం వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని కోరారు. టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికను రూపొందిస్తున్నారని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీలను ఉపాధ్యాయులు సన్మానించారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. వైఎస్సార్ టీఎఫ్ ప్రధాన కార్యదర్శి గడ్డెల సుదీర్, గౌరవ అధ్యక్షుడు జాలిరెడ్డి, వ్యవస్థాపకులు ఓబులాపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ని సన్మానించారు. 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో 1998 డీఎస్సీ అభ్యర్థులతోపాటు, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఉన్నారు. చదవండి: (CM Jagan: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ విజేత కల్పలతారెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజేత టి. కల్పలతారెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమె ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఆరిమండ విజయ శారద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లా టీచర్ ఎమ్మెల్సీగా కల్పలత విజయం
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలతారెడ్డి విజయం
సాక్షి, అమరావతి: కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా కల్పలతారెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలతారెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది పోటీ చేయగా, 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
చిరునామా అడిగి మళ్లీ స్నాచింగ్
హైదరాబాద్ : మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. చిరునామా అడుగుతూ లంగర్‌హౌస్‌లో మహిళ మెడలోని మంగళసూత్రాన్ని తెంచుకెళ్లారు. ఐదు రోజుల క్రితం ఇదే విధంగా ఇదే ప్రాంతంలో దుండగులు ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఆ ఘటన మరువక ముందే మళ్లీ స్నాచింగ్ జరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... లంగర్‌హౌస్ గాంధీనగర్‌లో నివాసముండే కల్పలతా రెడ్డి(45) సోమవారం ఉదయం 7 గంటలకు తన ఇంటి వాకిలి ఊడుస్తోంది. ఆ సమయంలో పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు ఆమె ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపారు. వారిలో ఒకడు వాహనం దిగి కల్పలతారెడ్డి వద్దకు వచ్చాడు. తమకు ఓ చిరునామా చెప్పాలని అడుగుతూనే ఆమె మెడలోని 6 తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని అప్పటికే బైక్ వేచి ఉన్న వ్యక్తితో కలిసి పారిపోయారు. వారిని స్థానికులు వెండించినా ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.