చిరునామా అడిగి మళ్లీ స్నాచింగ్ | another chain snatching in langar house | Sakshi
Sakshi News home page

చిరునామా అడిగి మళ్లీ స్నాచింగ్

Dec 29 2015 5:13 PM | Updated on Sep 3 2017 2:46 PM

చిరునామా అడిగి మళ్లీ స్నాచింగ్

చిరునామా అడిగి మళ్లీ స్నాచింగ్

మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. చిరునామా అడుగుతూ లంగర్‌హౌస్‌లో మహిళ మెడలోని మంగళసూత్రాన్ని తెంచుకెళ్లారు.

హైదరాబాద్ : మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. చిరునామా అడుగుతూ లంగర్‌హౌస్‌లో మహిళ మెడలోని మంగళసూత్రాన్ని తెంచుకెళ్లారు. ఐదు రోజుల క్రితం  ఇదే విధంగా ఇదే ప్రాంతంలో దుండగులు ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఆ ఘటన మరువక ముందే మళ్లీ స్నాచింగ్ జరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.  పోలీసుల కథనం ప్రకారం.... లంగర్‌హౌస్ గాంధీనగర్‌లో నివాసముండే కల్పలతా రెడ్డి(45) సోమవారం ఉదయం 7 గంటలకు తన ఇంటి వాకిలి ఊడుస్తోంది.

ఆ సమయంలో పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు ఆమె ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపారు.  వారిలో ఒకడు వాహనం దిగి కల్పలతారెడ్డి వద్దకు వచ్చాడు. తమకు ఓ చిరునామా చెప్పాలని అడుగుతూనే ఆమె మెడలోని 6 తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని అప్పటికే బైక్ వేచి ఉన్న వ్యక్తితో కలిసి పారిపోయారు. వారిని స్థానికులు వెండించినా ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement