సాక్షి, హైదరాబాద్: బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం’’ అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలిపారు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి. భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.
‘‘హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితం. శాంతిభద్రతల పరిరక్షణలో మాకు సహకరించండి. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయండి. నిశ్చింతగా ఉండండి. మీ భద్రతే మా బాధ్యత’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.
బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం.
దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి.
భయాందోళనలు సృష్టించేలా… pic.twitter.com/fOmkk80ie7— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 29, 2026


