
మద్యం మత్తులో చేసినట్లు నిర్ధారణ..అరెస్ట్
డోన్ టౌన్: నంద్యాల జిల్లా డోన్‌లోని శ్రీరామనగర్‌లో మంగళవారం రాత్రి ఓ పోలీస్ చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న శ్రీనివాస ఆచారి హోంగార్డుగా పోలీసు శాఖలో ప్రవేశించి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఇతను కొద్దినెలలుగా విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు.
సిక్ లీవులో ఉంటున్న ఈయన మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఈ నెల 14న రాత్రి ఓ మహిళ మెడలోని చైన్ లాగేస్తూ స్థానికులకు దొరికిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు పోలీసుపై పట్టణ పోలీసుస్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. గురువారం అతడిని అరెస్ట్ చేసి డోన్ ఫస్టక్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించారు.