
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపాటు
సాక్షి, అమరావతి: అసమర్థ విధానాలతో కూటమి ప్రభుత్వం టీచర్లలో అలజడి సృష్టిస్తోందని వైఎస్సార్‌సీపీ ఆర్‌టీఐ విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. ‘విద్యార్థి, ఉపాధ్యాయుల రేషియోలో అశాస్త్రీయ విధానం కారణంగా దాదాపు 10 వేల మంది స్కూల్ అసిస్టెంట్లను సర్‌ప్లస్‌గా చూపే పరిస్థితి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకువచి్చన సంస్కరణలను కక్షతోనే నిర్విర్యం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా రంగాన్ని బతికించాలంటూ వీధుల్లోకి వచ్చి పోరాడే దుస్థితి తెచ్చారు. 117 జీఓను రద్దు చేస్తూ, దానికి బదులుగా తెచ్చిన 19, 20, 21 జీవోల వల్ల ప్రైమరీ స్కూళ్లకు ఎటువంటి మేలు జరగడం లేదు. ఇదివరకు ఉన్న ఆరు రకాల స్కూళ్లను నాలుగింటికి తగ్గిస్తామని చెప్పి.. తొమ్మిదికి పెంచారు.
ఉపాధ్యాయుల్లో అయోమయ పరిస్థితి. వైఎస్ జగన్ టీచర్లకు పదోన్నతులు ఇస్తే, కూటమి ప్రభుత్వం వారికి డిమోషన్స్ ఇస్తోంది. ఒకవైపు మిగులు టీచర్లను చూపుతూ, మరోవైపు డీఎస్సీలో కొత్త టీచర్ పోస్ట్‌లను ఎలా భర్తీ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీలో పోస్ట్‌లను తగ్గించేందుకే ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల రేషియోను 1-53 కాకుండా 1-40 ప్రకారం తీసుకోవాలి. సెకండ్ సెక్షన్ కూడా హైసూ్కల్‌కు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్‌లకు న్యాయం చేయాలి. సబ్జెక్ట్ టీచర్లను పక్కకు పెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలి’.