మహిళలందరికీ వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు | Ys Jagan Extends International Women Day 2026 Greetings | Sakshi
Sakshi News home page

మహిళలందరికీ వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Mar 7 2026 6:49 PM | Updated on Mar 7 2026 7:06 PM

Ys Jagan Extends International Women Day 2026 Greetings

సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లు అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

‘‘మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటుంది.. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధికారత లక్ష్యంగా మా హయాంలో పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేశాం.

..అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాం. దాదాపు 32కు పైగా పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించాం. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారు. మహిళల అభ్యున్నతే.. ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement