తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల చిత్తూరులో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి చంద్రబాబు, నారా లోకేష్ వైఖరే కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఉరితాడు బిగించారని, ఇది ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణం మీదకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘చంద్రబాబు గారూ.. చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా? ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్ర ఇది..
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2025 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
మీ కుట్రలతో పేద కుటుంబాలు ఒత్తిడి భరించలేకపోతున్నాయి..
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు. ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు. పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ? ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు. చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2026
ఇదీ చదవండి: వైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలతో కూటమి 'కలరింగ్'!


