ఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అరాచకం, అక్రమాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా.. అంతమై పోయిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలోని ఏపీలో రాజ్యాంగ బద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన నడుస్తుందా? అని ప్రశ్నించారు.
‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జరిగిన ఆందోళనలపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన స్థానంలో అడవిలో రాజ్యం నడుస్తోందా?, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా స్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారా?, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది. రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడం కోసం వాటిని బలిపీఠం ఎక్కించకూడదు. ఎన్నికల సమగ్రతను, పారదర్శకతను కాపాడేందుకు కఠినమైన, అమలు చేయదగిన మార్గదర్శకాలను రూపొందించాలి. దీనిపై నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా’ అని పేర్కొన్నారు.
Under CM Naidu, the Andhra Pradesh Government must answer for the serious concerns surrounding the conduct of these Municipal elections. Is Jungle Raj replacing the rule of law? Has democracy itself been put to death in Andhra Pradesh? Free and fair elections are the bedrock of democracy. They cannot be sacrificed at the altar of political power. I intend to approach the Court seeking stringent and enforceable guidelines to safeguard the integrity of elections.
— Subramanian Swamy (@Swamy39) November 13, 2026
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలైనా నిష్పాక్షికంగా జరగాలి: బుగ్గన


