విదేశీ లిస్టింగ్ నిబంధనల సవరణ
డిబెంచర్లు, ప్రిఫరెన్స్ షేర్లకు ఓకే
గిఫ్ట్ ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సే్చంజీలలో వీలు
న్యూఢిల్లీ: మార్పిడికి వీలయ్యే డిబెంచర్లు, ప్రిఫరెన్స్ షేర్లను గిఫ్ట్, ఐఎఫ్‌ఎస్‌సీలలోని ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసేందుకు దేశీ కంపెనీలకు వెసులుబాటు దక్కింది. ఇందుకు వీలుగా ప్రభుత్వం నిబంధనలను సరళీకరించింది. తద్వారా నిధుల సమీకరణకు మరిన్ని మార్గాలకు దారి చూపింది. అంతేకాకుండా అన్‌లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలు, ప్రతికూల (నెగటివ్) నెట్‌వర్త్ కలిగిన సంస్థలను సైతం కొన్ని నిబంధనలకులోబడి విదేశీ లిస్టింగ్‌కు అనుమతిస్తారు. ఇందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
వెరసి ఇకపై ఈక్విటీ షేర్లతోపాటు.. ప్రిఫరెన్స్ షేర్లు, మార్పిడికి వీలయ్యే డిబెంచర్లు సైతం లిస్టింగ్ మార్గదర్శకాలలోనికి చేరనున్నాయి. దీంతో విదేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించేందుకు ఈ ఎక్సే్ఛంజీల ద్వారా దేశీ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఆఫర్‌లో కనీసం 75 శాతాన్ని అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్)కు కేటాయించడం ద్వారా విదేశీ లిస్టింగ్‌కు అవకాశం ఏర్పడనుంది. ఐఎఫ్‌ఎస్‌సీ పరిధిలో నిర్వహణలోగల అన్‌లిస్టెడ్ కంపెనీలు ఐఎఫ్‌ఎస్‌సీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా విదేశీ లిస్టింగ్ చేపట్టేందుకు వీలుంటుంది. 2024 జనవరిలో ప్రభుత్వం గిఫ్ట్ ఐఎఫ్‌ఎస్ ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజీలో సెక్యూరిటీల ప్రత్యక్ష లిస్టింగ్‌కు దేశీ కంపెనీలను అనుమతించిన సంగతి తెలిసిందే.


