ఎగబడిన పసిడి ప్రియులు.. ఎలక్ట్రానిక్‌ బంగారానికి భారీ డిమాండ్‌! | Dhanteras Effect NSE Electronic Gold Trading Volume Surges | Sakshi
Sakshi News home page

ఎగబడిన పసిడి ప్రియులు.. ఎలక్ట్రానిక్‌ బంగారానికి భారీ డిమాండ్‌!

Nov 6 2026 7:24 PM | Updated on Nov 6 2026 7:42 PM

Dhanteras Effect NSE Electronic Gold Trading Volume Surges

పండుగ వేళ బంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. సంప్రదాయ ఆభరణాలు, నాణేల కొనుగోళ్లతో పాటు డిజిటల్‌ రూపంలో బంగారంపైనా పెట్టుబడులు పెట్టేందుకు  ఇన్వెస్టర్లు తెగ ఆసక్తి చూపించారు. దీనికి నిదర్శనంగా ధంతేరాస్‌ (ధన త్రయోదశి) సందర్భంగా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లో ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసిప్ట్స్‌ (EGR) ట్రేడింగ్‌ భారీగా పెరిగింది. నవంబర్‌ 6న ఒక్కరోజే 1,81,763 యూనిట్ల ట్రేడింగ్‌ జరగ్గా, లావాదేవీల విలువ సుమారు రూ.26.46 కోట్లకు చేరింది. ఈ విభాగంలో ఒక్కరోజులో లక్ష యూనిట్ల మార్కును దాటడం విశేషం.

ఏమిటి ఈజీఆర్‌?

ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసిప్ట్స్‌ అనేవి భౌతిక బంగారంపై యాజమాన్యాన్ని సూచించే డీమ్యాట్‌ రూపంలోని సెక్యూరిటీలు. వీటికి సమానమైన బంగారం సెబీ గుర్తింపు పొందిన వాల్ట్‌లలో భద్రంగా నిల్వ ఉంటుంది. అంటే ఇంట్లో బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకోవాల్సిన అవసరం లేకుండానే, షేర్ల మాదిరిగా డీమ్యాట్‌ ఖాతా ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.. విక్రయించవచ్చన్న మాట. నిబంధనలకు అనుగుణంగా ఈ రసీదులను భౌతిక బంగారంగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

ఎన్‌ఎస్‌ఈ ఈ ఏడాది మే 4న ఈ విభాగాన్ని ప్రారంభించగా, మే 18 నుంచి ప్రత్యక్ష ట్రేడింగ్‌ మొదలైంది. 995, 999 స్వచ్ఛత కలిగిన బంగారంతో పాటు 100 మిల్లీగ్రాముల నుంచి కిలోగ్రాము వరకు వివిధ పరిమాణాల్లో ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. వీటిపై ట్రేడింగ్‌ సెటిల్‌మెంట్‌ సాధారణంగా T+1 విధానంలో జరుగుతుంది.

భారీ ట్రేడింగ్‌.. తగ్గిన ధర

ట్రేడింగ్‌ పరిమాణం పెరిగినప్పటికీ, ఈజీఆర్‌ ధర మాత్రం క్షీణించింది. శుక్రవారం సెషన్‌లో యూనిట్‌ ధర రూ.1,460 వద్ద ప్రారంభమై, గరిష్ఠంగా అదే స్థాయిని తాకింది. కనిష్ఠంగా రూ.1,450.20కి పడిపోయింది. చివరకు రూ.1,456 వద్ద ముగిసింది. అంతకుముందు ముగింపు ధర రూ.1,574తో పోలిస్తే ఇది 7.5 శాతం తగ్గుదల.

భౌతిక బంగారంపైనా ఆసక్తి

మరోవైపు, బంగారం ధరలు అధికంగా ఉన్నప్పటికీ ధంతేరాస్‌ సందర్భంగా ఆభరణాల దుకాణాలకు వినియోగదారులు భారీగా తరలివచ్చారు. ముంబైలోని జవేరీ బజార్‌లోనూ కొనుగోళ్లు జోరుగా సాగినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఆభరణాలతో పాటు బంగారు నాణేలు, సంప్రదాయ కొనుగోళ్లకు వినియోగదారులు ప్రాధాన్యం ఇచ్చారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో చిన్న పరిమాణంలో, తక్కువ బరువున్న ఆభరణాల కొనుగోళ్ల వైపు కూడా ఆసక్తి కనిపిస్తోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఈ కింద చూడొచ్చు..

gold1
1/6

gold2
2/6

gold3
3/6

gold4
4/6

silver5
5/6

silver6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement