‘వంతారా’కు కేరళ నుంచి ఏనుగు కూన ఎయిర్‌లిఫ్ట్ | Miracle for Maya: Critical Elephant Calf Airlifted to Vantara | Sakshi
Sakshi News home page

‘వంతారా’కు కేరళ నుంచి ఏనుగు కూన ఎయిర్‌లిఫ్ట్

Nov 6 2026 3:26 PM | Updated on Nov 6 2026 3:36 PM

Miracle for Maya: Critical Elephant Calf Airlifted to Vantara

తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ‘మాయ’ అనే 18 నెలల ఆడ ఏనుగు కూనకు వైద్యం చేసేందుకు కేరళ అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. అత్యంత అధునాతన నిపుణుల వైద్య చికిత్స కోసం ఈ ఏనుగును గుజరాత్‌లోని జామ్‌నగర్‌గల ‘వంతారా’ ఆసుపత్రికి విమానం (ఎయిర్‌లిఫ్ట్) ద్వారా తరలించేందుకు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ డాక్టర్ పి.పుగజేంది ఉత్తర్వులు జారీ చేశారు.

అడవిలో దొరికిన ఏనుగు కూన

2025 ఏప్రిల్ 19న మలయాట్టూర్ అటవీ ప్రాంతంలో ఏనుగు గుంపు నది దాటుతుండగా ఈ నవజాత ఏనుగు పిల్ల తల్లి నుంచి వేరుపడింది. తీవ్ర నీరసంతో ఉన్న ఈ కూనను కేరళ అటవీ సిబ్బంది రక్షించి అభయారణ్యం పునరావాస కేంద్రానికి తరలించారు. అసిస్టెంట్ ఫారెస్ట్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ బినోయ్ సి.బాబు, కేర్‌టేకర్లు ఏడాదికి పైగా పాలు తాపిస్తూ దీన్ని కాపాడారు. దానికి ‘మాయ’ అని పేరు పెట్టారు.

దెబ్బతిన్న ఎముకలు..

2026 జులైలో ఓ సందర్భంలో జారిపడటంతో మాయ కుడి భుజానికి తీవ్ర గాయమైంది. కాల్సియం సప్లిమెంట్లు, ఫిజియోథెరపీ ఇచ్చినా పరిస్థితి మెరుగుపడలేదు. అక్టోబరు నాటికి మాయ నిలబడలేక పోయింది. అక్టోబరు 24న పూకోడ్ వెటర్నరీ కళాశాల నిపుణులు పరీక్షించగా మాయ ఎముకలు విరిగిపోయాయని, తీవ్ర బలహీనత వల్ల పడుకునే ఉండటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. పుట్టుకలోపం వల్ల ఎముకలు అరుగుతున్నాయని, మాయ బాధను నివారించేందుకు దయామరణం (Euthanasia) ఒక్కటే మార్గమని మెడికల్ బోర్డు ప్రతిపాదించింది.

చివరి ప్రయత్నంగా వంతారా

అయితే కేరళ అటవీ శాఖ వెంటనే ఆశ వదులుకోలేదు. పద్మశ్రీ డాక్టర్ కుశాల్ కొన్వర్ శర్మ, వంతారా ప్రధాన వైద్యుడు డాక్టర్ యదురాజ్ ఖడ్పెకర్‌లతో కేరళ మెడికల్ బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇది పారాథైరాయిడ్ సమస్య కావచ్చునని, వంతారాలోని అత్యాధునిక ఐసీయూ వైద్యంతో కోలుకునే అవకాశం ఉందని డాక్టర్ శర్మ సూచించారు. దీంతో వంతారాకు తరలించేందుకు బోర్డు ఏకగ్రీవంగా అంగీకరించింది.

కేరళ బృందం ప్రయాణం

వెంటిలేటర్లు, ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ ఉన్న ప్రత్యేక ఎయిర్‌లిఫ్ట్ ద్వారా మాయను తరలిస్తున్నారు. మాయకు కొత్త వాతావరణంలో భయం లేకుండా ఉండేందుకు కేరళ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ బినోయ్, కేర్‌టేకర్ నిఖిల్ బాబు కూడా మాయతో పాటే జామ్‌నగర్ వెళ్తున్నారు. వంతారాలో 24 గంటల పర్యవేక్షణ, హైడ్రాలిక్ లిఫ్టులతో వైద్యం అందించనున్నారు. చికిత్స పూర్తయి మాయ కోలుకున్న తర్వాత తిరిగి అభయారణ్యం కేంద్రానికి తీసుకువస్తారు.

ఇదీ చదవండి: ఇవి కొంటే మీ బ్యాడ్‌లక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement