breaking news
Vantara
-
వంతారాకు ఊరట
అనంత్ అంబానీ (Anant Ambani) స్థాపించిన వంతారా (Vantara) సంస్థకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఆలయ ఏనుగుల (Elephants)ను తరలిస్తే.. అందులో ఎలాంటి తప్పూ లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏనుగుల తరలింపుపై సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.గుజరాత్ జామ్‌నగర్‌లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వంతారాకు క్లీన్చిట్ ఇచ్చినట్లు జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. ఏనుగుల తరలింపులో తప్పులేమీ లేదు, నిబంధనల ప్రకారం జరిగితే సరే. ఏనుగులు బాధపడుతున్నాయ్ అని చెప్పినప్పుడు.. దానికి ఆధారాలేమిటో కూడా పిటిషనర్ చూపించాలి కదా. ఇది దేశ గర్వంగా భావించే విషయం. కాబట్టి దీన్ని తక్కువ చేయకండి. పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు అస్పష్టమైనవిగా కనిపిస్తున్నాయి. విచారణ కొనసాగించాలంటే, పిటిషనర్లు తమ వాదనలను స్పష్టంగా, ఆధారాలతో సమర్పించాల్సిన అవసరం ఉంది అని కోర్టు అభిప్రాయపడింది.ఈ క్రమంలో.. వంతారాలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను అస్పష్టమైనదిగా న్యాయస్థానం తోసిపుచ్చింది. వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈవిషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వంతారాలో చట్టాలను పాటించట్లేదని.. విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ.. ఇటీవల పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సుప్రీంకోర్టు (Supreme Court)లో పిల్ దాఖలు చేశాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ.. వంతారా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలు, వన్యప్రాణుల సంక్షేమం, ఆర్థిక పారదర్శకత వంటి అంశాల్లో సవ్యంగా ఉందంటూ నివేదికను ఇచ్చింది. ఆ నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది కూడా. అయితే ఇదంతా బయటి దేశాల నుంచి జరుగుతున్న కుట్ర అని, భారత్ చేస్తున్న మంచి పనులపై జంతువుల వేటను అనుమతించే దేశాలు ఈవిధంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని.. ఈ విషయంలో దర్యాప్తునకు తాము అన్నివిధాలా సిట్‌కు సహకరిస్తామని వంతారా తరఫు న్యాయవాది మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. -
వంతారాపై సుప్రీంకోర్టు విచారణ.. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పణ
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాలో చట్టవిరుద్ధంగా జంతువులను కొనుగోలు చేశారనే ఆరోపణలపై నిజనిర్ధారణ విచారణ నిర్వహించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ రిపోర్ట్‌ను రికార్డ్ చేసింది.దర్యాప్తులో భాగంగా సిట్ బృందం వంతారాలో మూడు రోజులు గడిపింది. విచారణలో భాగంగా బృందానికి సహకరించడానికి అనేక రాష్ట్ర అటవీ శాఖల సీనియర్ అధికారులతో సహా అనేక ఇతర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇన్వెస్ట్‌గేషన్ సందర్భంగా వంతరా సీనియర్ సభ్యులను సుదీర్ఘంగా ప్రశ్నలు అడిగి ధ్రువపత్రాలు సేకరించింది.పిటిషనర్ ఆరోపణలు..సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని సిట్.. పిటిషనర్ సీఆర్ జయ సుకిన్ లేవనెత్తిన ఆరోపణలపై నిజనిర్ధారణ విచారణ జరిపింది. వన్యప్రాణుల రెస్క్యూ, పునరావాస సదుపాయాన్ని నిర్వహించే ముసుగులో ఏనుగులు, పక్షులు, అంతరించిపోతున్న జాతులతో సహా చట్టవిరుద్ధంగా జంతువులను కొనుగోలు చేసిందని పిటిషన్లో ఆరోపించారు. వన్యప్రాణుల రక్షణ చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు, జంతు సంక్షేమ ప్రమాణాలకు వ్యతిరేకంగా జంతువులను కేంద్రంలోకి తరలించారని పిటిషనర్ పేర్కొన్నారు.వంతారా స్పందనఈ వ్యవహారంపై వంతారా స్పందిస్తూ చట్టపరంగా మూగజీవులను కాపాడేందుకు పక్కాగా చర్యలు పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. ‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తున్నాం. పారదర్శకతతో చట్టాన్ని పూర్తిగా పాటించడానికి వంతారా కట్టుబడి ఉంది’ అని వంతారా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 25, 2025న సిట్‌ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, సెప్టెంబర్ 12 లోగా తన ఫలితాలను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సిట్ తన నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించింది.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: జీఎస్టీ కోతతో ఇళ్లకు డిమాండ్ -
పంజాబ్‌లో వరద బాధితులకు రిలయన్స్ సాయం
పంజాబ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండగా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనంత్ అంబానీ భరోసా కల్పించారు. బాధితుల కష్టాలు తీర్చే ఉద్దేశంతో సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అందులో భాగంగా స్థానిక అధికారులు, రాష్ట్ర పరిపాలన విభాగం, పంచాయతీలు, వివిధ కమ్యూనిటీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఈమేరకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమృత్సర్, సుల్తాన్పూర్ లోధిలోని 10,000 కుటుంబాలకు సహాయం అందించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.‘ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది. తీవ్ర వర్షాభావం వల్ల చాలా కుటుంబాలు ఇళ్లు, జీవనోపాధి, భద్రతను కోల్పోయాయి. రిలయన్స్ కుటుంబం వారికి తోడుగా ఉంటుంది. ఆహారం, నీరు, ఆశ్రయం, పారిశుద్ధ్య కిట్లు.. వంటి వాటితో ప్రజలు, జంతువుల సంరక్షణకు అన్ని చర్యలు అందిస్తోంది. పంజాబ్ ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో వారితో కలిసి ఉంటాం’ అని అనంత్ అంబానీ అన్నారు.రిలయన్స్ అందిస్తోన్న సహాయక చర్యలు..న్యూట్రిషన్ సపోర్ట్వరద బాధితుల కోసం అత్యవసర పోషకాహార అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతుంది. వారికి అవసరమైన ఆహార సామాగ్రి, డ్రై రేషన్ కిట్లను 10,000 కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒంటరి మహిళలు, వృద్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 వంతున వోచర్ ఆధారిత సహాయం అందించనున్నారు. తక్షణ పోషణను నిర్దారించేందుకు కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పోర్టబుల్ వాటర్ ఫిల్టర్లను సిద్ధం చేస్తున్నారు.షెల్టర్ సపోర్ట్వరదల నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలను రక్షించడానికి రిలయన్స్ టార్పాలిన్లు, గ్రౌండ్ షీట్లు, దోమతెరలు, తాళ్లతో కూడిన అత్యవసర షెల్టర్ కిట్లను అందిస్తోంది. వరద నీటి నుంచి అత్యవసరంగా ఆశ్రయం అవసరమైన కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ప్రజారోగ్య ప్రమాద నిర్వహణలో భాగంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి రిలయన్స్ ఆరోగ్య అవగాహన ప్రచారాలను చేపడుతోంది. నీటి వనరుల్లో క్రిమిసంహారక చర్యలకు పూనుకుంది. వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రతి ప్రభావిత కుటుంబానికి అవసరమైన పారిశుద్ధ్య కిట్లను అందజేస్తున్నారు.పశువుల ఆరోగ్యానికి మద్దతుగా..వరదల వల్ల పశుసంవర్ధక రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశువుల ఆవాసాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జంతువుల మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్, పశుసంవర్ధక శాఖ సహకారంతో పశువైద్య సర్వేలు నిర్వహిస్తోంది. పశువుల సంరక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభావిత జంతువులకు మందులు, చికిత్సలు అందిస్తున్నారు. దాదాపు 5,000 పశువులకు ఆహారం ఇవ్వడానికి 3,000 కట్టల సైలేజ్ (పశుగ్రాసం) పంపిణీ చేస్తున్నారు.జంతు సంరక్షణజంతు సంరక్షణ కోసం రిలయన్స్‌కు చెందిన వంటారాలోని ప్రత్యేక బృందం సహాయక చర్యలను అందిస్తోంది. 50 మందికి పైగా శిక్షణ పొందిన నిపుణులతో ఈ బృందం జంతువులను రక్షించడం, వైద్య సంరక్షణను అందించడం, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి పని చేస్తోంది.కమ్యునికేషన్ పునరుద్ధరణవరద ప్రభావిత ప్రాంతాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో జియో బృందం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉండేలా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)తో కలిసి పనిచేస్తోంది. విపత్తు సహాయ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సర్వీసులు అందించేందుకు చర్యలు చేపడుతోంది.రిలయన్స్ ఫౌండేషన్ స్థానిక వాలంటీర్ల సహకారంతో క్యూరేటెడ్ డ్రై-రేషన్, పారిశుద్ధ్య కిట్లను పంపిణీ చేస్తోంది. పోషణ, పరిశుభ్రత కోసం 21 నిత్యావసర వస్తువులను కలిగి ఉన్న ఈ కిట్లను స్థానిక పంచాయతీల పరిధిలోని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. -
అంబానీ ‘వంతారా’పై సిట్ విచారణ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భారతదేశంతో పాటు విదేశాల నుండి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను తీసుకురావడంలో చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపధ్యంలో అనంత్ అంబానీకి చెందిన ‘వంతారా’పై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గల గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ, పునరావాస కేంద్రం వంతారాపై నిజనిర్ధారణ విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చిన పలు నివేదికలు, ఎన్జీఓలు, వన్యప్రాణుల సంస్థల నుండి ‘వంతారా’లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వచ్చిన ఆరోపణల మేరకు దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్‌లు పంకజ్ మిథల్, పీబీ వరలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం మాజీ న్యాయమూర్తి జె. చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యుల సిట్ కమిటీని ‘వంతారా’పై విచారణకు ఏర్పాటు చేసింది.పిటిషన్లలో ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, ప్రైవేట్ ప్రతివాది లేదా మరే ఇతర పార్టీల కౌంటర్‌ను లెక్కించడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని సుప్రీం కోర్టు పేర్కొంది. సాధారణంగా ఇటువంటి ఆధారం లేని ఆరోపణలపై ఆధారపడిన పిటిషన్‌ను చట్టపరంగా స్వీకరించేందుకు అర్హత లేదని, అందుకు బదులుగా దానిని తాత్కాలికంగా కొట్టివేయాలని కూడా పేర్కొంది. అయితే వంతారాలో వాస్తవ పరిస్థితిని ధృవీకరించాలని, అప్పుడు ఇటువంటి ఆరోపణలు నిజమా కాదా అనేది తేలుతుందని, అందుకే విచారణ అనేది న్యాయ దృక్పథంలో సముచితమని భావిస్తున్నామని తొమ్మిది పేజీల ఉత్తర్వులో సుప్రీం కోర్టు పేర్కొంది.‘వంతారా’కు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల సిట్ బృందంలో జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు, జస్టిస్ (రిటైర్డ్) రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీసు కమిషనర్ హేమంత్ నగ్రాలే, మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అనిష్ గుప్తా ఉండనున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. భారతదేశంతో పాటు విదేశాల నుండి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను సేకరించడం, వన్యప్రాణుల (రక్షణ) చట్టం అమలు, సజీవ జంతువుల దిగుమతి, ఎగుమతులకు సంబంధించి ‘వంతారా’ అనుసరిస్తున్న విధానాలపై దర్యాప్తు జరిపి, ఆ నివేదికను సమర్పించాలని ‘సిట్’కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లలో ఆరోపించిన మనీలాండరింగ్ లాంటి ఆరోపణలను కూడా ఈ ప్యానెల్ పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఆ ఏనుగుకు అక్కడే అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం: వంతారా
అనంత్ అంబానీ నిర్వహిస్తున్న వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారాలో సంరక్షిస్తున్న మాధురి అనే ఏనుగును తిరిగి కొల్హాపూర్‌కు తరలించే ప్రయత్నాలకు తాము పూర్తిగా సహకరిస్తామని గుజరాత్‌ని జంతు సంరక్షణ కేంద్రం వంతారా తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకే ఆ ఏనుగును వంతారాకు తీసుకొచ్చామని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని వంతారా మరోసారి స్పష్టం చేసింది.పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) పిటిషన్ ఆధారంగా బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు గత నెలలో మాధురి ఏనుగును కొల్హాపూర్ లోని నందిని మఠం నుంచి జామ్ నగర్ లోని వంతరా కేంద్రానికి తరలించారు. స్థానికులు మాధురి ఏనుగును పవిత్రంగా భావించే కొల్హాపూర్ లో ఈ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తాయి. అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీంతో ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా చెప్పారు. దీనిపై స్పందించిన వంతరా ఒక ప్రకటన విడుదల చేసింది.మాధురిని కొల్హాపూర్ కు తిరిగి రప్పించాలని కోరుతూ జైన మఠం, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వంతరా పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపింది. సుప్రీం కోర్టు అనుమతికి లోబడి మాధురి ఏనుగును సురక్షితంగా, గౌరవప్రదంగా తిరిగి కొల్హాపూర్‌కు తరలించడానికి పూర్తి సాంకేతిక, పశువైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా దీర్ఘకాలిక పరిష్కారంగా కొల్హాపూర్ లో మాధురి కోసం శాటిలైట్ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటును వంతరా ప్రతిపాదించింది. మఠం, మహారాష్ట్ర ప్రభుత్వం, జంతు సంక్షేమ నిపుణుల సహకారంతో ఈ కొత్త సదుపాయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. మఠం అధిపతి, రాష్ట్ర అధికారులతో చర్చించి భూమిని ఎంపిక చేస్తామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు తమ బృందం సిద్ధంగా ఉందని వంతరా తెలిసింది.ప్రతిపాదిత కేంద్రంలో కల్పించే సౌకర్యాలుహైడ్రోథెరపీ పాండ్, స్విమ్మింగ్ ప్రాంతంలేజర్ థెరపీ గదులు, పునరావాస ప్రదేశాలునైట్ షెల్టర్, గొలుసులు లేని భారీ బయలు ప్రదేశంసహజ ప్రవర్తన, ఆట కోసం ఇసుక గుంట24/ 7 సంరక్షణ కోసం పూర్తిస్థాయి సౌకర్యాలతో పశువైద్యశాలకీళ్ల నొప్పులు,పాదాల కుళ్లడం వంటి వాటి నుంచి ఉపశమనం, విశ్రాంతి కోసం మృదువైన రబ్బరు ఫ్లోర్లు, ఇసుక దిబ్బలు -
ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్.. దానిపై అన్నీ అవే!
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. ఈ నెలలో తన భార్య నీతా అంబానీతో 40వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరి ఓ ప్రత్యేకమైన కేక్ తయారు చేశారు. 30 కేజీల బరువున్న ఈ కేక్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రత్యేకమైన కేక్ చూడవచ్చు. ఈ కేక్ మీద సింహాలు, జిరాఫీలు, ఏనుగులు, మొసళ్ళు వంటి వివిధ జంతువుల ఆకారాలు బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. జామ్‌నగర్‌లోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమయిన వంతారాను ప్రేరణగా తీసుకుని ఈ కేక్ మీద జంతువుల బొమ్మలు చిత్రించారు.కేక్ మధ్యలో నీతా, ముకేశ్ అంబానీల మొదటి అక్షరాలు ఉన్నాయి. పై భాగంలో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ఉండటం చూడవచ్చు. దీనిని ముంబైలోని ప్రముఖ బేకరీ డెలిసియాను నడుపుతున్న బంటీ మహాజన్ తయారు చేశారు.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Deliciae by Bunty Mahajan (@delcakes.in) -
జీవ్ మే శివ్ హై.. వంతారా కృషిపై ఆధ్యాత్మిక గురువు స్పందన
వన్యప్రాణుల సంరక్షణలో అనంత్ అంబానీ చేస్తున్న విశేష కృషిని బాగేశ్వర్ ధామ్ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ప్రశంసించారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నేతృత్వంలోని ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారా ‘జీవ్ మే శివ్ హై’ అనే దృక్పథంతో పని చేస్తుందని చెప్పారు. ధీరేంద్ర శాస్త్రి వంతారా చేస్తున్న కృషిని కొనియాడుతూ వీడియో విడుదల చేశారు. అదికాస్తా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.వీడియోలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం..‘జీవ్ మే హి శివ్ హై.. ప్రతి జీవంలో శివుడు ఉంటాడు. ఇది అన్ని జీవుల్లో దైవిక ఉనికిని గుర్తించే తత్వం. ఎన్నో కారణాలవల్ల సంరక్షణకు నోచుకోని జంతువులకు కొత్త జీవితాన్ని అందించే కేంద్రం వంతారా ఎంతో కృషి చేస్తోంది. వంతారా అంటే ‘అటవీ నక్షత్రం’. దీని పేరుకు తగినట్లుగానే ఎన్నో వన్యప్రాణులను రక్షిస్తోంది. ఇందుకు అనంత్ అంబానీ అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. వంతారా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వణ్యప్రాణుల సంరక్షణ చర్యలకు ప్రేరణ ఇస్తోంది. మానవాళికి సమస్త జీవరాశుల సంరక్షణ స్ఫూర్తిని పెంపొందిస్తోంది’ అని తెలిపారు. View this post on Instagram A post shared by Peepingmoon (@peepingmoonofficial)వంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ కేర్ సెంటర్లో 240కి పైగా ఏనుగులను రక్షించారు. అల్లోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్(చైనాలో మాదిరి సుదులతో గుచ్చి రోగాన్ని నయం చేయడం) వైద్యాన్ని సమ్మిళితం చేసే అధునాతన పశువైద్య చికిత్సలను వంతారాలో అందిస్తున్నారు. ఆర్థరైటిస్ చికిత్స కోసం హైడ్రోథెరపీ, గాయం నయం చేయడానికి హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్ వంటి ప్రత్యేక సదుపాయాలున్నాయి.ఇదీ చదవండి: హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!‘ప్రాణి మిత్ర’గా గుర్తింపుఅనంత్ అంబానీకి జంతు సంరక్షణలో చేస్తున్న కృషికి గుర్తుగా ఇటీవల భారతదేశపు అత్యున్నత గౌరవమైన ప్రతిష్టాత్మక ‘ప్రాణి మిత్ర’ జాతీయ పురస్కారం లభించింది. ప్రాణి మిత్ర జాతీయ పురస్కారం జంతు సంరక్షణ విభాగంలో అందించే అత్యున్నత పురస్కారం. జంతువుల శ్రేయస్సుకు అవార్డు గ్రహీతలు చేసిన అసాధారణ కృషిని ఇది గుర్తిస్తుంది. గత ఐదేళ్లలో జంతు సంక్షేమానికి విశేష కృషి చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాల కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తోంది. -
వంతారా వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రధాని మోదీ పర్యటన
-
అంబానీ వంతారా: పులి పిల్లలతో నరేంద్ర మోదీ - వీడియో
గుజరాత్‌లోని వన్యప్రాణుల రక్షణ, పునరావాసం & సంరక్షణ కేంద్రంమైన 'వంతారా'ను ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' ప్రారంభించారు. అక్కడ పరిసరాలను సందర్శించారు. అక్కడ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ఆయన సన్నిహితంగా మెలిగారు.వంతారాలోని వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించారు. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్లు, ICUలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు.ఆసియాటిక్ సింహానికి MRI చేయడం, హైవేలో కారు ఢీకొట్టిన తర్వాత గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయడం వంటి దృశ్యాలను మోదీ చూసారు. ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల, అరుదైన మరియు అంతరించిపోతున్న జాతి చిరుతపులి పిల్ల, కారకల్ పిల్ల వంటి వివిధ జాతులతో సరదాగా గడిపడమే కాకుండా.. వాటికి పాలు పట్టించడం వంటివియు కూడా మోదీ చేశారు.వంతారా కేంద్రంలో.. రక్షించబడిన జంతువులను వాటి సహజ ఆవాసాలను దగ్గరగా ప్రతిబింబించే ప్రదేశాలలో ఉంచారు. ఇక్కడ ఆసియాటిక్ సింహం, చిరుత, ఒక కొమ్ము గల ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్, హిప్పోపొటామస్, మొసళ్ళు, ఏనుగులు, పెద్ద పాములు మొదలైన జంతువులను మోదీ చూసారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన ఏనుగుల ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించారు. జంతువులను వీక్షించడమే కాకుండా.. వాటికి సేవ చేస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది, కార్మికులతో ప్రధానమంత్రి సంభాషించారు. వంతారాలో 2,000 కంటే ఎక్కువ జాతులు.. రక్షించబడిన, అంతరించిపోతున్న 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి.Watch: Prime Minister Narendra Modi inaugurated and visited Vantara, a wildlife rescue and conservation center in Gujarat, home to over 1.5 lakh rescued animals. He explored its advanced veterinary facilities, interacted with rare species, witnessed surgeries, and participated in… pic.twitter.com/XV5j8mELaz— IANS (@ians_india) March 4, 2025 -
Vantara అనంత్ అంబానీ ‘వంతారా’ అరుదైన ఘనత
రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ (Anant Ambani) మరో ఘనతను సాధించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమారుడిగా జంతుప్రేమికుడిగా అనంత్ అంబానీ అందరికీ సుపరిచితమే. జంతు రక్షణ, ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కోసం వంతారా (Vantara) అనే సంస్థను స్థాపించారు. అనంత్ అంబానీ ప్రాణప్రదమైన వంతారాకు ప్రతిష్టాత్మక 'ప్రాణి మిత్ర' జాతీయ అవార్డు లభించింది.'కార్పొరేట్' విభాగంలో జంతు సంక్షేమంలో భారతదేశంలోని అత్యున్నత గౌరవం పురస్కారం 'ప్రాణి మిత్ర' ( Prani Mitra Award ) జాతీయ అవార్డు వంటారా దక్కించుకుంది. వంటారా సంస్థ అయిన రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT)కు గౌరవం దక్కింది. ఈ అవార్డును భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ సహాయ మంత్రి గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేశారు. దీనికి వంతారా సీఈవో వివాన్ కరణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జంతు సంక్షేమం పట్ల వంతారా లోతైన నిబద్ధతను నొక్కి చెప్పారు. సంక్షేమ ప్రమాణాలను పెంచడం, భారతదేశ జీవవైవిధ్యాన్ని కాపాడటం వారి లక్ష్యమనన్నారు. "ఈ అవార్డు భారతదేశ జంతువులను రక్షించడానికి, సంరక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన అనేక మంది వ్యక్తులకు నివాళి. వంతారాలో, జంతువులకు సేవ చేయడం అంటే కేవలం డ్యూటీ కాదు - ఇది తమ ధర్మం, సేవ, కరుణ, తమ బాధ్యతలో దృఢమైన నిబద్ధత అన్నారు. భవిష్యత్తరాలకోసం దేశ గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడటం అనే లక్ష్యంలో తాము అలుపెరగకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.చదవండి : పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్‌గా!కెరీర్లో పీక్‌లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనంవంతారాగుజరాత్లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. వంతారాలోని ఎలిఫెంట్ కేర్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగు ఆసుపత్రికి నిలయంగా ఉంది. 240కి పైగా ఏనుగులకు రక్షణ కల్పిస్తోంది. ఇక్కడ ఏనుగులకు ప్రపంచ స్థాయి పశువైద్య చికిత్స, కరుణా సంరక్షణ లభిస్తుంది. ఇక్కడ అల్లోపతిని ప్రత్యామ్నాయ వైద్యంతో అనుసంధానించే అధునాతన పశువైద్య సంరక్షణను అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ కోసం ఆయుర్వేదం మరియు నొప్పి నివారణ కోసం అక్యుపంక్చర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. దీని అత్యాధునిక వైద్య సౌకర్యాలలో ఆర్థరైటిస్ చికిత్స కోసం అధిక పీడన నీటి జెట్లతో కూడిన హైడ్రోథెరపీ చెరువు, గాయం నయం కోసం హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్ , పెడిక్యూర్ నిపుణులతో అంకితమైన పాద సంరక్షణ సౌకర్యాలుండటం విశేషం.అలాగే వంతారా అతిపెద్ద ఏనుగు అంబులెన్స్‌ల సముదాయాన్ని నిర్వహిస్తోంది.హైడ్రాలిక్ లిఫ్ట్‌లు, రబ్బరు మ్యాట్ ఫ్లోరింగ్, వాటర్ ట్రఫ్లు, షవర్లు , కేర్‌టేకర్ క్యాబిన్లున్న 75 కస్టమ్-ఇంజనీరింగ్ వాహనాలున్నాయి. -
అంతరించిపోయిన ఐకానిక్ పక్షులకోసం అనంత్ అంబానీ కీలక నిర్ణయం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్య ప్రాణుల సంరక్షణలో మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న వంతారా బ్రెజిల్లో దాదాపు అంతరించి పోయినట్టు ప్రకటించిన ఐకానిక్ పక్షులను రక్షించేందుకు నడుంబిగించింది. బ్రెజిల్‌లోని కాటింగా బయోమ్ అడవిలో అంతరించిపోయిన 41 స్పిక్స్ మకావ్ (Cyanopsitta spixii) లకు పునరుజ్జీవం తెచ్చేందుకు రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి వంతారా అనుబంధ సంస్థ గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), అసోసియేషన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటెండ్ పేరెట్స్ (ACTP)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.2000లో అంతరించిపోయినట్లు ప్రకటించినన స్పిక్స్ మాకా (సైనోప్సిట్టా స్పిక్సీ) అనే జాతిని పునరుద్ధరించే ప్రయాణంలో ఈ ఐకానిక్ పక్షులను బ్రెజిల్‌లోని వాటి స్థానిక ఆవాసాలకు తిరిగి పరిచయం చేయడమే ఈ చొరవ లక్ష్యం. ఇందులో GZRRC ప్రాజెక్ట్‌లో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.జర్మనీలోని బెర్లిన్‌లోని ఏసీటీపీ బ్రీడింగ్ సెంటర్ నుండి 41 స్పిక్స్ మకావ్‌లను బ్రెజిల్‌లోని బాహియాలోని విడుదల కేంద్రానికి విజయవంతంగా తరలించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించిందిఅనంత్ అంబానీ నేతృత్వంలోని వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా. ఈ గ్లోబల్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా, వంతారా నిపుణులు ఏసీటీపికి మార్గదర్శకత్వం చేయడంతో పాటు కీలకమైన వనరులను అందిస్తారు. వీటిల్లో 2022లో 20 స్పిక్స్ మకావ్‌లను అడవిలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ఫలితంగా 20 సంవత్సరాలలో తొలిసారి పిల్లలు పుటాయనీ, ఇది ప్రోగ్రామ్ పురోగతికి సామర్థ్యానికి నిదర్శనమని వంతారా ప్రకటించింది.బ్రెజిల్‌కు బదిలీకి ఎంపిక చేయబడిన 41 స్పిక్స్ మకావ్‌లను వాటి వంశపారంపర్యత, ఆరోగ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఇందులో 23 ఆడ, 15 మగ, 3 ఇంకా నిర్ధారించని చిన్న పిల్లలున్నాయి. ఈ సంవత్సరం విడుదలకు సిద్ధమవుతున్న బృందంలో కొన్ని చేరగా, మరికొన్ని దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బ్రీడింగ్ ప్రోగ్రామ్‌లో చేర్చారు.. బదిలీకి ముందు, పక్షులు బెర్లిన్‌లోని ఒక బ్రీడింగ్ ఫెసిలిటీలో 28 రోజుల కంటే ఎక్కువ క్వారంటైన్లో ఉన్నాయి. అక్కడి అడవి పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఏవైనా వ్యాధులకు లేవని నిర్దారించుకునేందుకు వీలుగా సమగ్ర పరీక్షలు నిర్వహించారు. జనవరి 28న, ఆ పక్షులు బెర్లిన్ నుండి చార్టర్డ్ విమానంలో బ్రెజిల్‌లోని పెట్రోలినా విమానాశ్రయానికి బయలు దేరి, అక్కడికి చేరుకున్న తర్వాత, వాటిని నేరుగా క్వారంటైన్ సౌకర్యానికి తరలించారు. ఈ బదిలీని ఇద్దరు పశువైద్యులు , ఏసీటీపిఒక కీపర్ జాగ్రత్తగా పర్యవేక్షించారు, వీరితో పాటు వంటారా GZRRC నుండి నిపుణుల బృందం కూడా ఉంది.స్పిక్స్ మకావ్స్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్‌కు వారి అద్భుతమైన కృషి చేసిన అనంత్ అంబానీ , వంతారాబృందానికి ACTP వ్యవస్థాపకుడు మార్టిన్ గుత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోయిన జాతుల రక్షణలోఆర్థిక సహాయంతో పాటు, నైపుణ్యం ఎంతో అమూల్యమైనదని కొనియాడారు.హాలీవుడ్ చిత్రం రియోలో ప్రముఖంగా కనిపించిన స్పిక్స్ మకా, బ్రెజిలియన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో, బ్రెజిల్లో ఒక ప్రత్యేక విడుదల కేంద్రం స్థాపించారు. ఆ తర్వాత 2020లో జర్మనీ బెల్జియం నుండి 52 పక్షులను రవాణా చేశారు. 2022లో, 20 స్పిక్స్ మకావ్‌లను వాటి సహజ ఆవాసాలలోకి విడుదల చేయగా, ఏడు అడవి కోడిపిల్లలు జన్మించాయి. భారతదేశ వైవిధ్యమైన వన్యప్రాణుల వారసత్వాన్ని పునరుద్ధరించడానికి కూడా వంతారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కట్టడిలో ఉన్న ఖడ్గమృగాలను సురక్షితమైన ఆవాసాలలోకి తిరిగి ప్రవేశపెట్టడం, సంతానోత్పత్తి , ఆవాస పునరుద్ధరణ ద్వారా ఆసియా సింహాల జనాభాను బలోపేతం చేయడం వాటి సంతానోత్పత్తి కార్యక్రమం తర్వాత చిరుతలను భారతీయ అడవులకు తిరిగి తీసుకురావడం వంటివి ఉన్న సంగతి తెలిసిందే. -
అంబానీ జూకు ఏనుగుల తరలింపుపై విమర్శలా?!
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజరాత్..? మూడు వేలకు పైగా కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి.. అదీ ట్రక్కులలో ఏనుగులను తరలించడం ఏంటి?. స్పెషల్ ట్రక్కులలో అంబానీ కుటుంబానికి చెందిన జూకు ఏనుగులను తరలించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మూగజీవుల కోసం పోరాడే ఉద్యమకారులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూసి.. ‘‘పాపం ఏనుగులు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?’’ అని తిట్టుకునేవారు లేకపోలేదు. అయితే..అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) నుంచి మాత్రమే కాదు.. అసోం(Assam) నుంచి కూడా జామ్ నగర్‌లోని అనంత్ అంబానీకి చెందిన వంతార జూనకు ఏనుగులను తరలించారట. ఈ తరలింపునకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. పైగా వన్యప్రాణులను అలా బంధించడమూ నేరమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిజనిర్ధారణలు చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి తరలింపునకు అసలు అనుమతులు ఉన్నాయా?. వన్యప్రాణులను ఇలా జంతు ప్రదర్శన శాలలో ఉంచొచ్చా?. దారిలో వాటికి ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?... ఎవరిది బాధ్యత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో వాస్తవమెంత?. అయితే ఇవేం అడవుల నుంచి బలవంతంగా తరలిస్తున్న ఏనుగులు కాదని అధికారులు వివరణ ఇస్తున్నారు. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగానే వాటిని తరలిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏనుగులను బంధించి.. వాటితో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నుంచి వాటికి విముక్తి కలిగిస్తున్నారు. రిలయన్స్ వంతార జూ ‘చైన్ ఫ్రీ’ ఉద్యమం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే తాజా వీడియోలపై విమర్శల నేపథ్యంలో.. ఇటు వంతారా నిర్వాహకులు కూడా స్పందించారు.ఆరోగ్యకరమైన వాతావరణంలో అవి జీవిస్తాయని మాది గ్యారెంటీ. వాటికి గౌరవప్రదమైన జీవితం అందించడమే మా ఉద్దేశం’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇందుకు అవసరమైన ప్రక్రియ అంతా అధికారికంగానే నిర్వహించినట్లు స్పష్టత ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారమే నడుచుకున్నట్లు, అలాగే.. గుజరాత్ , అరుణాచల్ ప్రదేశ్ అటవీ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఏనుగుల తరలింపు కోసం రవాణా శాఖల నుంచీ ప్రత్యేక అనుమతులు పొందినట్లు పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. అవి అటవీ ఏనుగులు కాదని, ప్రైవేట్ ఓనర్ల నుంచి వాటిని వంతారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. త్రిపుర హైకోర్టు వేసిన హైపవర్ కమిటీతో పాటు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేసింది. వాటిని తరలించిన ఆంబులెన్స్‌లు కూడా ప్రత్యేకమైన సదుపాయాలతోనే తరలించినట్లు పేర్కొంది.అసోం ప్రభుత్వం మాత్రం.. తమ భూభాగం నుంచి ఏనుగుల తరలింపేదీ జరగలేదని స్పష్టం చేసింది. అసోం నుంచి గుజరాత్ ప్రైవేట్ జూకు జంతువుల తరలింపు పేరిట అసత్య ప్రచారాలు, కథనాలు ఇస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివరణలలేవీ వైల్డ్‌లైఫ్(Wild Life) యాక్టవిస్టులను సంతృప్తి పర్చడం లేదు. పైగా వాతావరణ మార్పు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, యానిమల్ ఆంబులెన్స్ పేరిట తరలిస్తున్న వాహనాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారం ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.వంతార.. రిలయన్స్ సౌజన్యంతో నడిచే అతిపెద్ద జంతు సంరక్షణశాల. దేశంలోనే అతిపెద్దది. ముకేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్ అట. అలా.. మూగ జీవుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో ఎక్కడా లేనన్ని సేవలతో ఈ జూను నడిపిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఏమేం ఉన్నాయంటే..వంతార జూ(Vantara Zoo)లోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్మెంట్ కోసం అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేసి.. వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి. -
వంతారాకు కొత్త అతిథులు
ఇస్కాన్ మాయాపూర్‌కు చెందిన రెండు ఏనుగులు బిష్ణుప్రియ, లక్ష్మీప్రియల సంరక్షణ బాధ్యతలను జంతు పునరావాస కేంద్రం వంతారా తీసుకోనుంది. గత ఏప్రిల్‌లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసిన విషాద సంఘటన తరువాత ఈ మేరకు ఇస్కాన్, వంతారా మధ్య ఒప్పందం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా జంతు సంరక్షణ కేంద్రం ప్రసిద్ధి చెందింది.అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ఈ రెండు ఏనుగులకు శాశ్వత నివాసం కల్పించనుంది. ఈ ఏనుగుల బదిలీకి సంబంధించి త్రిపుర హైకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నుంచి పూర్తి ఆమోదం లభించింది. ఆపదలో ఉన్న అడవి జంతువులను రక్షించడం, ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడానికి అనువైన ప్రాంతాలను అన్వేషించడం ఈ కమిటీ బాధ్యత.బిష్ణుప్రియ, లక్ష్మీప్రియ ఏనుగుల కోసం సహజ ఆవాసాన్ని ప్రతిబింబించేలా వంతారాలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇస్కాన్ మాయాపూర్ 2007 నుంచి లక్ష్మీప్రియను, 2010 నుంచి బిష్ణుప్రియను ఆలయ ఆచారాలకు, వివిధ పండుగ సందర్భాలకు ఉపయోగిస్తోంది. కొన్ని కారణాల వల్ల గత ఏప్రిల్‌లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా, వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్‌తో సహా జంతు సంరక్షణ సంస్థలు ఇస్కాన్ ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించాలని తెలిపాయి.ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబానీ హాజరువంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.