సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ అధినేత అంబానీ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న వంతారా జూపార్క్ బ్రాంచ్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ సిటీలోనే ఈ జూపార్క్ ఏర్పాటు కాబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన వంతరా బృందం.. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే కొత్త జూ పార్క్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో MOU కుదుర్చకుంది. వంతారా-అటవీశాఖ అధికారులు సీఎం సమక్షంలో ఒప్పందానికి వచ్చారు.
ఈ సందర్భంగా జంతువుల సేవ నినాదంతో వంతారా పని చేయడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే జూపార్క్‌లో జంతువులకు.. గుజరాత్ జామ్ నగర్ వంతారాలో ఉన్న సదుపాయాలన్నీ కల్పించాలని.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదే సమయంలో.. ఈ నెల చివర్లో తానే స్వయంగా సీఎం రేవంత్ వంతారా టీంతో అన్నారు.


