2026 సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం | Telangana Government Holidays List 2026, Check Out 27 General And 26 Optional Holidays Details | Sakshi
Sakshi News home page

Telangana Govt Holidays List: 2026 సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Dec 8 2025 7:15 PM | Updated on Dec 8 2025 8:15 PM

Telangana Govt Declared 2026 Holiday List Details Here

రాష్ట్రంలో 2026 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నంబరు 1715) జారీ చేసింది. 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది. మరో 26 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది.

జనవరి 14న బుధవారం భోగి, వెంటనే 15 జనవరి గురువారం సంక్రాంతి/పొంగల్.. 26 జనవరి సోమవారం గణతంత్ర దినోత్సవం.. ఫిబ్రవరిలో 15న ఆదివారం మహాశివరాత్రి.. మార్చి 3న మంగళవారం రంగుల పండుగ హోలీ, 19 మార్చి గురువారం ఉగాది, 21 మార్చి శనివారం రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్), 22 మార్చి ఆదివారం రంజాన్ తరువాతి రోజు, అలాగే 27 మార్చి శుక్రవారం శ్రీరామ నవమి..

ఏప్రిల్‌న శుక్రవారం గుడ్ ఫ్రైడే, 5 ఏప్రిల్ ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 14 ఏప్రిల్ మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి.. 27 మే బుధవారం బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా).. 26 జూన్ శుక్రవారం మొహర్రం (ఇమామ్ హుస్సేన్ షహాదత్ – 10వ రోజు)..

10 ఆగస్టు సోమవారం బోనాలు, 15 ఆగస్టు శనివారం స్వాతంత్ర్య దినోత్సవం, 26 ఆగస్టు బుధవారం ఈద్ మిలాద్-ఉన్-నబీ.. 4 సెప్టెంబర్ శుక్రవారం శ్రీకృష్ణ అష్టమి, 14 సెప్టెంబర్ సోమవారం వినాయక చవితి.. 2 అక్టోబర్ శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి, 18 అక్టోబర్ ఆదివారం సద్దుల బతుకమ్మ, 20 అక్టోబర్ మంగళవారం విజయదశమి, 21 అక్టోబర్ బుధవారం విజయదశమి తరువాతి రోజు..

8 నవంబర్ ఆదివారం దీపావళి, 24 నవంబర్ మంగళవారం కార్తీక పౌర్ణమి / గురు నానక్ జయంతి.. 25 డిసెంబర్ శుక్రవారం క్రిస్మస్, 26 డిసెంబర్ శనివారం క్రిస్మస్ తరువాతి రోజు (బాక్సింగ్ డే)గా ప్రకటించింది.

ఐచ్చిక సెలవులు (Optional Holidays)గా.. 1 జనవరి గురువారం నూతన సంవత్సరం, 3 జనవరి శనివారం హజ్రత్ అలీ జన్మదినం, 16 జనవరి శుక్రవారం కనుమ, 17 జనవరి శనివారం షాబ్-ఎ-మెరాజ్, 23 జనవరి శుక్రవారం శ్రీపంచమి, 4 ఫిబ్రవరి బుధవారం షాబ్-ఎ-బరాత్… ఇలా మొత్తం 26 ఉన్నాయి. అయితే.. వీటిల్లో ఉద్యోగులు తమ ఇష్టప్రకారం గరిష్టంగా 5 రోజులు మాత్రమే తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు గాక అయిదు ఐచ్ఛిక సెలవులను ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని జీవోలో స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement