దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ వారసుడు, వ్యాపారవేత్త అనంత్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అటు వ్యాపారంతోపాటు, వన్య ప్రాణుల సంరక్షణ కోసం ‘వంతార’ ఏర్పాటు చేసి మరింత ఆకర్షణీయమైన వ్యక్తిగా నిలిచాడు. తాజాగా అనంత్ అంబానీ, వంతారాకు సంబంధించి మరో అంశం విశేషంగా నిలుస్తోంది.
న్యూయార్క్‌కు చెందిన లగ్జరీ జాకబ్ & కో అనంత్ అంబానీ కోసం కస్టమ్ 'వంతారా' గడియారాన్ని రూపొందించింది. ఈ హోరోలాజికల్ మాస్టర్‌పీస్ 'ఒపెరా వంటారా గ్రీన్ కామో' ను జనవరి 21న ఆవిష్కరించింది. అనంత్ అంబానీకి ఇష్టమైన వంతారాకు నివాళిగా ఈవాచ్‌ను తయారు చేసింది. డెమాంటాయిడ్ గోమేదికాలు, సావోరైట్‌లు, ఆకుపచ్చ నీలమణి , తెల్ల వజ్రాలు ఇందులో ఉన్నాయి. 21.98 క్యారెట్లతో దాదాపు 400 విలువైన రాళ్ల సంక్లిష్టమైన అమరిక అని, జాకబ్ అండ్ కో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ టైమ్‌పీస్ విలువ దాదాపు ‘1.5 మిలియన్లు’ (సుమారు రూ.12.5 కోట్లు). ప్రస్తుతం ఇది హోరాలజీ ప్రియులతోపాటు, ఫ్యాషన్ ప్రియుల ప్రశంసలందుకుంటోంది. (నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు)
'ది వంతారా'లో 397 రత్నాలు
ఈ వాచ్ డిజైన్ మరింత స్పెషల్‌గా నిలుస్తోంది. డయల్‌లో మధ్యలో చేతితో తయారుచేసిన అనంత్ అంబానీ బొమ్మ అమర్చారు. అలాగే చుట్టూ బెంగాల్ టైగర్, సింహాన్నిఅమర్చారు. అలాగే బంగారం రూపొందించిన వంతారా, ఎనుగు ఈ డయల్‌లో మరో ఆకర్షణ. అనంత్ అంబానీ లగ్జరీ వాచెస్ అంటే చాలా ఇష్టం. దీనికి సంబంధించినాయన దగ్గర పెద్ద కలెక్షనే ఉంది. తాజాగా ప్రపంచంలోనే ఉత్తమమైన జాకబ్ బ్రాండ్‌ది కూడా చేరింది. అనంత్ అంబానీ గడియారాల్లో పటేక్ ఫిలిప్, ఆడెమర్స్ పిగ్యుట్, రిచర్డ్ మిల్లె, రోలెక్స్ నుండి చాలా అందమైన విలాసవంతైన టైమ్‌పీస్‌లు చోటు దక్కించుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ. 200 కోట్లకు పైమాటేనని అంచనా.


