ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ.. రేంజ్ రోవర్ కీలక నిర్ణయం తీసుకుంది. 2027 చివరి నాటికి తన పాపులర్ మోడల్స్ అయిన రేంజ్ రోవర్ ఎవోక్, రేంజ్ రోవర్ వెలార్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని రేంజ్ రోవర్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ లింపర్ట్ వెల్లడించారు.
ఇకపై రేంజ్ రోవర్ బ్రాండ్ కింద ప్రధానంగా మూడు మోడళ్లు మాత్రమే ఉండనున్నాయి. అవి రేంజ్ రోవర్ జీటీ, రేంజ్ రోవర్ స్పోర్ట్, ఫుల్ సైజ్ రేంజ్ రోవర్. కాగా కంపెనీ తక్కువ ధరల విభాగంపై ద్రుష్టి సారించనుంది. ఇందులో భాగంగానే.. కొత్తగా డిఫెండర్ స్పోర్ట్ మోడల్‌ను తీసుకురానున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న ఎవోక్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.
అయితే కంపెనీ తన రేంజ్ రోవర్ జీటీను 2027 ప్రారంభంలో ఫుల్ ఎలక్ట్రిక్ మోడల్‌గా విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఆ తరువాత ఇందులో హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకురానుంది. అయితే రాబోయే రేంజ్ రోవర్ జీటీ.. వెలార్ కారుకు ప్రత్యామ్నాయం కాదని కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు డిఫెండర్ స్పోర్ట్ కూడా ఇదే ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై తయారుకానుంది.
ఇదీ చదవండి: ధనత్రయోదశి వేళ.. బంగారం ఢమాల్!


