ఈ వారం 11 ఐపీవోలు | 11 Companies To Raise Rs 7055 Crore Through IPOs | Sakshi
Sakshi News home page

ఈ వారం 11 ఐపీవోలు

Sep 7 2026 6:31 AM | Updated on Sep 7 2026 6:32 AM

11 Companies To Raise Rs 7055 Crore Through IPOs

ఐపీవో స్ట్రీట్‌

రూ. 7,055 కోట్ల సమీకరణ 

ఈ ఏడాది 75 కంపెనీల ఇష్యూలు 

ఆగస్ట్‌లోనే 23 కంపెనీల లిస్టింగ్‌

ప్రైమరీ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. గత నెల(ఆగస్ట్‌)లో ఏకంగా 23 కంపెనీలు లిస్టింగ్‌కాగా.. వచ్చే వారం మరో 11 ఐపీవోలు ప్రారంభకానున్నాయి. 7–15 మధ్య చేపట్టనున్న ఇష్యూల ద్వారా ఇవి ఉమ్మడిగా రూ. 7,055 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. మొత్తం రూ. 7,055 కోట్లలో రూ. 2,722 కోట్లు(39 శాతం) తాజా ఈక్విటీ జారీకాగా.. మరో రూ. 4,333 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

 మంగళ, బుధ వారాల్లో అధిక ఇష్యూలు మార్కెట్లను పలకరించనున్నాయి. జాబితాలో రియల్టీ డెవలపర్స్, ఇంజినీరింగ్, తయారీ, పేమెంట్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఆన్‌లైన్‌ రిటైల్‌ ప్లాట్‌ఫామ్‌ తదితర కంపెనీలున్నాయి. వీటితో కలిపి ఈ ఏడాది 75 కంపెనీలు నిధుల సమీకరణ బాటలో సాగినట్లు నమోదుకానుంది. వివరాలు చూద్దాం.. 

ప్రణవ్‌ కన్‌స్ట్రక్షన్స్‌తో షురూ 
నేడు(7న) ప్రణవ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఐపీవో ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 351 కోట్లు సమీకరించనుంది. రేపు(8న) కనోహర్‌ ఎలక్ట్రికల్స్, ప్రసోల్‌ కెమికల్స్, గ్లాస్‌వాల్‌ సిస్టమ్స్‌(ఇండియా) ఇష్యూలు షురూకానుండగా.. 9న స్టీమ్‌హౌస్‌ ఇండియా, 10న వీగాలాండ్‌ డెవలపర్స్‌ మార్కెట్లను తాకనున్నాయి. 

ధరల శ్రేణి తీరిలా 
ప్రణవ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఐపీవోకు ధరల శ్రేణి రూ. 118–124కాగా.. రూ. 316 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 35 కోట్ల విలువైన మరో 28.57 లక్షల షేర్లను ఆఫర్‌ చేయనుంది. కనోహర్‌ ఎలక్ట్రికల్స్‌ రూ. 601–632 ధరల శ్రేణిలో రూ. 1,056 కోట్ల సమీకరణపై కన్నేసింది. ప్రసోల్‌ కెమికల్స్‌ రూ. 643–676 ధరల శ్రేణి నిర్ణయించడం ద్వారా రూ. 500 కోట్లు అందుకోనుంది. ఈక్విటీ జారీతో రూ. 80 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా మరో రూ. 420 కోట్లు సమీకరించనుంది. గ్లాస్‌వాల్‌ సిస్టమ్స్‌ రూ. 172–182 ధరల శ్రేణితో రూ. 428 కోట్ల సమీకరణకు రెడీ అయ్యింది. 

వీగాలాండ్‌ సైతం 
ఆర్సిల్‌ రూ. 132–139 ధరల శ్రేణిలో రూ. 733 కోట్ల సమీకరణకు సిద్ధపడింది. పూర్తిగా ప్రస్తుత వాటాదారు సంస్థలు షేర్లను విక్రయించనున్నాయి. ఇక రూ. 427 కోట్ల సమీకరణకుగాను ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌ రూ. 139–146 ధరల శ్రేణి నిర్ణయించింది. స్టీమ్‌హౌస్‌ ఇండియా ఇష్యూలో భాగంగా రూ. 353 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా రూ. 61 కోట్ల విలువైన షేర్లు ఆఫర్‌ చేయనుంది. వెరసి రూ. 414 కోట్లు అందుకోవాలని చూస్తోంది. ఈ నెల 10న ప్రారంభమై 15న ముగియనున్న ఐపీవో ద్వారా వీగాలాండ్‌ డెవలపర్స్‌ రూ. 210 కోట్లు సమీకరించనుంది. 

→ ఈక్విటీ జారీ నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించడంతోపాటు.. సాధారణ కార్పొరేట్‌ 
అవసరాలకు సైతం కేటాయించనున్నాయి. 

→ రేస్‌ ఆఫ్‌ బిలీప్, దీపా జ్యువెలర్స్‌ ఐపీవోలతో ఈ నెల(సెపె్టంబర్‌)లో ఐపీవోల సందడి జోరందుకున్న విషయం విదితమే. పర్పుల్‌ ల్యాబ్స్‌తో ప్రారంభించి నేటి(7) నుంచి రెండు వారాలపాటు వరుసగా ఈ కంపెనీలన్నీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలో లిస్ట్‌కానుండటం గమనార్హం!

రెంటోమోజో @ రూ. 384–404
ఐపీవో ద్వారా రూ. 1,256 కోట్ల సమీకరణపై దృష్టి పెట్టిన రెంటోమోటో రూ. 384–404 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇందుకు రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు రూ. 1,106 కోట్ల విలువైన 2.73 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. కరంటారా ఇంజినీరింగ్‌ ఐపీవోకు ధరల శ్రేణి రూ. 241–254కాగా.. రూ. 675 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 200 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ చేయనుంది. మణిపాల్‌ పేమెంట్‌ అండ్‌ ఐడెంటిటీ సొల్యూషన్స్‌ ఇష్యూకి రూ. 322–339 ధరల శ్రేణి ప్రకటించింది. రూ. 805 కోట్లు సమకూర్చుకోనుంది. ఇందుకు రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీ జారీసహా రూ. 485 కోట్ల విలువైన 1.43 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement