ఐపీవోలకు గ్రే మార్కెట్‌ జోష్‌  | Grey market buzz for IPOs | Sakshi
Sakshi News home page

ఐపీవోలకు గ్రే మార్కెట్‌ జోష్‌ 

Aug 20 2026 1:38 AM | Updated on Aug 20 2026 1:38 AM

Grey market buzz for IPOs

జత కలసిన లాభాల లిస్టింగ్‌

పలు ఇష్యూలకు భారీ స్పందన 

‘ఫోమో’తో రిటైల్‌ ఇన్వెస్టర్ల క్యూ

కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతుంటే.. మరోపక్క ప్రైమరీ మార్కెట్లు పలు ఇష్యూలతో సందడి చేస్తున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనను అందుకోవడంతోపాటు.. లాభాల లిస్టింగ్‌తో ఐపీవో మార్కెట్లో జోష్‌ పెంచుతున్నాయి. ఫలితంగా కొత్త ఇష్యూలకు గ్రే(అనధికార అన్‌లిస్టెడ్‌) మార్కెట్లో ప్రీమియం పెరుగుతోంది. వెరసి ఇన్వెస్టర్లకు బస్‌ మిస్సవుతున్నామన్న ఆందోళన(ఫోమో) పెరిగి దరఖాస్తు చేసేందుకు క్యూ కడుతున్నారు. 

తాజాగా లిస్టయిన షిప్‌రాకెట్‌ ఇష్యూ ధర రూ. 97కాగా.. రూ. 143 వద్ద నిలిచింది. రూ. 285 ధరతో పోలిస్తే బెహారీలాల్‌ ఇంజనీరింగ్‌ రూ. 503 వద్ద స్థిరపడింది. ఇక ప్రస్తుతం మిల్కీ మిస్ట్‌ డెయిరీ(రూ. 140) తాజాగా 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ తాకి రూ. 200 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో మాల్బియో(రూ. 807) రూ. 1,177కు ఎగసి రూ.1,037 వద్ద ముగిసింది. ధూత్‌ ట్రాన్స్‌మిషన్‌(రూ. 871) రూ. 1,404 వద్ద, టెక్నోక్రాఫ్ట్‌(రూ. 212) రూ. 315 వద్ద, ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్‌(రూ. 425) రూ. 570 వద్ద ముగిశాయి.  

అనధికార ప్రీమియం...
ఇటీవల పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతుండటంతో ఐపీవోకు వచ్చే కంపెనీల షేర్లు ముందుగా ట్రేడయ్యే అనధికార(గ్రే) మార్కెట్లో ప్రీమియం పలుకుతున్నాయి. ఫలితంగా కొత్త ఇష్యూలకు చిన్న ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. దీంతో షిప్‌రాకెట్‌కు రిటైలర్ల విభాగంలో 46 రెట్లు, బెహారీ లాల్‌కు 53 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఈ బాటలో ఆగ్మంట్, టెంప్సన్స్, సన్‌షైన్‌ పిక్చర్స్, స్కైవేస్‌ ఎయిర్, లలితా జ్యువెలరీ ఇష్యూలకు గ్రే మార్కెట్లో ప్రీమియం ధర పలుకుతోంది. 

ఐపీవో వేవ్‌...
రూ. 2,600 కోట్ల సమీకరణ లక్ష్యంగా హారిజన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్స్, రూ. 1,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో లలితా జ్యువెలరీ ఐపీఓలు బుధవారం(19న) ముగిశాయి. ఈ బాటలో నేడు(గురువారం) షేరుకి రూ. 88–93 ధరల శ్రేణితో ఆభరణ వర్తక సంస్థ శంకేష్‌ జ్యువెలర్స్, రూ. 342–360 ధరల శ్రేణితో  టీవీ ప్రొడక్షన్‌ సంస్థ సన్‌షైన్‌ పిక్చర్స్‌ ఐపీవోలు ముగియనున్నాయి.  

మరో 4 కంపెనీలు...
గజా క్యాపిటల్‌ బ్రాండ్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గజా ఆల్టర్నేటివ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఐపీవో బుధవారం(19న) ప్రారంభమైంది. ఇందుకు ధరల శ్రేణి షేరుకి రూ. 152–160కాగా.. తద్వారా రూ. 550 కోట్లు అందుకునే యోచనలో ఉంది.  టెంప్సన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌(ఇండియా) ఐపీవో నేడు(20న) ప్రారంభంకానుంది. రూ. 825 కోట్ల సమీకరణ కోసం గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ ప్లాట్‌ఫామ్‌.. ఆగ్మంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రేపు(21న) పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది.

  ఈ బాటలో సోమవారం(24న) లాజిస్టిక్స్‌ కంపెనీ స్కైవేస్‌ ఎయిర్‌ సరీ్వసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. తద్వారా రూ. 583 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. గత వారం ఐదు కంపెనీలు ఐపీవోలు చేపట్టగా.. ఈ నెల మొదట్లో మరో మూడు కంపెనీలు నిధుల సమీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో 2026లో లిస్టింగ్‌ బాట పట్టిన కంపెనీల సంఖ్య 55కు చేరనుంది.  

రెండు లిస్టింగ్‌లు సూపర్‌ హిట్‌..!  
ఇటీవల పబ్లిక్‌ ఇష్యూ పూర్తి చేసుకొని, సెకండరీ మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన రెండు కంపెనీల షేర్లు లిస్టింగ్‌ రోజే ఇన్వెస్టర్లకు లాభాల 
పంట పండించాయి. ‘షిప్‌రాకెట్‌ లిమిటెడ్‌’ షేరు ఇష్యూ ధరతో పోలిస్తే 48% పెరగ్గా, ‘బెహరీలాల్‌ ఇంజనీరింగ్‌’ షేరు సైతం ఏకంగా 76% 
ప్రీమియంతో మెరిసింది. 

‘షిప్‌ రాకెట్‌’ మ్యాజిక్‌ ..! 
టేమాసెక్, జొమాటోల పెట్టుబడులున్న ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘షిప్‌రాకెట్‌’ షేరు తొలి రోజే దూసుకెళ్లింది. ఇష్యూ ధర (రూ.97)తో పోలిస్తే బీఎస్‌ఈలో 34% ప్రీమియంతో రూ.130 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ అనిశి్చతుల్లోనూ ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 48% లాభంతో రూ.143 గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.10,441 కోట్లకు చేరింది. 

బెహరీలాల్‌ భళా..!  
ఐరన్, స్టీల్‌ తయారీ సంస్థ ‘బెహరీలాల్‌ ఇంజనీరింగ్‌’ షేరు మెప్పించింది. ఇష్యూ ధర (రూ.285)తో పోలిస్తే బీఎస్‌ఈలో 61% ప్రీమియంతో రూ.458 వద్ద లిస్టయ్యింది. ఒకానొక దశలో 89% శాతం ఎగబాకి రూ.537 గరిష్టాన్ని అందుకుంది. చివరకు 76% లాభంతో రూ.503 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,125.91 కోట్లుగా నమోదైంది.  

లలితా జ్యువెలరీ.. భేష్‌
ఐపీవోకు 63 రెట్లు స్పందన  
రూ. 190–201 ధరల శ్రేణిలో ఐపీవోకు వచి్చన లలితా జ్యువెలరీకి ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఇష్యూ జ్యువెలరీ కంపెనీలలోనే అత్యధికంగా 63 రెట్లు సబ్‌్రస్కయిబ్‌ అయ్యింది. 6,27,61,403 షేర్లు ఆఫర్‌ చేయగా.. 395 కోట్ల షేర్లకుపైగా బిడ్స్‌ దాఖలయ్యాయి. క్విబ్‌ విభాగంలో 145 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 74 రెట్లు, రిటైలర్ల నుంచి 12 రెట్లు చొప్పున దరఖాస్తులు లభించాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,700 కోట్లు సమీకరించింది. ఈ నెల 24న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానుంది.  

    – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement