రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో డబ్బు విషయంలో ముందుగానే సిద్ధంగా ఉండటం ఎందుకు ముఖ్యమో చాలా సింపుల్ ఉదాహరణతో వివరించారు.
ఒకసారి కొంతమంది ముందు మాట్లాడుతున్నప్పుడు తాను ప్రిప్పర్ అని కియోసాకి చెప్పారు. అంటే.. భవిష్యత్తులో ఏదైనా సమస్య లేదా అత్యవసర పరిస్థితి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండే వ్యక్తి. అప్పుడు ఒక మహిళ ఆయనను ఒక ప్రశ్న అడిగింది.
మహిళ ప్రశ్న.. కియోసాకి సమాధానం
మీరు ప్రిప్పర్ అయితే, ఎప్పుడూ ఏదో చెడు జరుగుతుందని ఆలోచిస్తున్నట్టే కదా?, పాజిటివ్‌గా ఆలోచించడం మంచిది కాదా?, అని ఆమె ప్రశ్నించింది.
దానికి కియోసాకి కారు ఇన్సూరెన్స్ ఉదాహరణగా చెప్పారు. మీ కారుకు ఇన్సూరెన్స్ ఉందా? అని అడిగారు. ఆమె ఉంది అని చెప్పింది. వెంటనే.. అంటే మీకు యాక్సిడెంట్ జరగాలని కోరుకుంటున్నారా? అని అడిగారు. అందుకు ఆమె.. లేదు. కానీ ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే నష్టాన్ని ఎదుర్కోవడానికి ఇన్సూరెన్స్ తీసుకున్నాను.. అని సమాధానం ఇచ్చింది.
ఆర్థిక విషయాల్లో ముందు చూపు
ఇక్కడే కియోసాకి చెప్పాలనుకున్న అసలు విషయం ఉంది. ముందుజాగ్రత్త తీసుకోవడం అంటే.. చెడు జరగాలని కోరుకోవడం కాదు. చెడు జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం. కారు విషయంలో ఇన్సూరెన్స్ తీసుకున్నట్లే, ఆర్థిక విషయాల్లో కూడా ముందుగానే రక్షణ కలిగి ఉండాలని ఆయన భావిస్తున్నారు.
తర్వాత ఆయన బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు ఉన్నాయా అని ఆ మహిళను అడిగారు. ఆమె దగ్గర అవేవీ లేవని చెబుతుంది. అప్పుడు.. ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో పెద్ద సంక్షోభం వస్తే మీ డబ్బుకు ఏమవుతుందని కియోసాకి ప్రశ్నిస్తారు. ప్రభుత్వం మరింత డబ్బును ముద్రిస్తుందని ఆమె సమాధానం చెబుతుంది.
ద్రవ్యోల్బణం వస్తే..
అప్పుడు ఆయన డబ్బు కొనుగోలు శక్తి గురించి మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగినప్పుడు అదే మొత్తంలో డబ్బుతో గతంలో కొనగలిగిన వస్తువులను కొనడం కష్టమవుతుంది. దీనినే సాధారణంగా ద్రవ్యోల్బణం అంటారు. ఉదాహరణకు, ఈరోజు రూ.100తో కొనగలిగిన వస్తువు కోసం.. రాబోయే రోజుల్లో రూ.120 లేదా రూ.150 చెల్లించాల్సి వస్తే, మన డబ్బు విలువ సంఖ్యలో అలాగే ఉన్నప్పటికీ దాని కొనుగోలు శక్తి తగ్గినట్టే.
ఇదీ చదవండి: AIని అదుపులో ఉంచగలమా.. పెరుగుతున్న ఆందోళన!
కియోసాకి అభిప్రాయం ప్రకారం.. అందుకే మన సంపద మొత్తాన్ని ఒకే రకమైన డబ్బు లేదా ఒకే ఆస్తిపై పెట్టుబడిగా పెట్టకూడదు. ప్రభుత్వం సృష్టించగలిగే కరెన్సీతో పాటు ఇతర రకాల ఆస్తులను కూడా కలిగి ఉండాలని ఆయన చెబుతారు. చివరగా మీరు ఆర్థికంగా ముందుచూపుతో ఉండే వ్యక్తేనా? అని ప్రశ్నించారు.
WHY I AM A PREPPER Speaking to a group the other day I mentioned I was a prepper. A woman raised her hand and asked “If you are a prepper, aren’t you being pessimistic? Isn’t positive thinking healthier? I replied “Do you have insurance on your car?” She replied “Yes” “Are you hoping for an accident?” “No” she replied shaking her head. I have insurance just incase I’m in an accident.” “Do you own any gold, silver, Bitcoin?” She shook her head “No.” “What will happen to your money when the economy crashes?” I asked. “The government will print more of it.” “And what will happen to the purchasing power of your money?” Nodding her head she replied, “It will go down in purchasing power?” “And that’s called…..?” “Inflation?” She smirked. “The Fed and government’ steal our wealth via our money….legally… because they can print it…legally.” They steal our wealth via taxation and inflation….legally. “I only want money the government cannot print.” “I also own oil wells. Governments are big buyers of oil. Great customers. They give me money” “And that’s why you’re a financial prepper? She said with smile. I just nodded my head. Q: Are you a “financial prepper?” A: And what is YOUR answer? Take care, 👍
— Robert Kiyosaki (@theRealKiyosaki) October 3, 2026


