3 కంపెనీలకు ఒకే | Sebi Opens The IPO Door For Three Companies | Sakshi
Sakshi News home page

3 కంపెనీలకు ఒకే

Sep 29 2026 5:14 AM | Updated on Sep 29 2026 5:14 AM

Sebi Opens The IPO Door For Three Companies

ఐపీవోలకు,  సెబీ గ్రీన్‌సిగ్నల్‌, 

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పయనీర్‌ ఫిల్‌మెడ్, టాన్బో ఇమేజింగ్‌ ఇండియా, ఫంక్షనల్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ ఫుడ్స్‌ పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టేందుకు మార్గమేర్పడింది. ఈ కంపెనీలు సెబీకి ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌– ఆగస్ట్‌ మధ్య కాలంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి.  

పయనీర్‌ ఫిల్‌మెడ్‌ 
ఐపీవో ద్వారా రైల్వే పరికరాల తయారీ కంపెనీ పయనీర్‌ ఫిల్‌మెడ్‌ రూ. 500 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. దీనిలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. పయనీర్‌ ఫేకర్‌ ఐటీ ఇన్‌ఫ్రాడెవలపర్స్, ఆజ్‌టెక్‌ ఇండియా విడిగా రూ. 125 కోట్ల విలువైన షేర్లు చొప్పున విక్రయించనున్నాయి. కాగా.. ఈక్విటీ జారీ నిధులను రాజస్తాన్‌లోని సాలార్‌పూర్‌(భివాడీ)లో గేర్‌బాక్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు, విండ్‌ జనరేటర్‌ విడిభాగాల తయారీ యూనిట్‌ ఏర్పాటుతోపాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది.  

టాన్బో ఇమేజింగ్‌ 
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా టాన్బో ఇమేజింగ్‌కు చెందిన ప్రస్తుత వాటాదారులు 1,80,85,246 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా వాటాదారులకు చేరనున్నాయి. 2003లో ఏర్పాటైన టాన్బో ఇమేజింగ్‌ ఇండియా ప్రధానంగా గ్లోబల్‌ డిఫెన్స్‌ ఎల్రక్టానిక్స్‌ తయారు చేస్తోంది. డిజైన్, అభివృద్ధి, తయారీ చేపడుతోంది. సెన్సింగ్, ప్రాసెసింగ్, కమ్యూనికేషన్, గైడెన్స్‌ సిస్టమ్స్‌ రూపొందిస్తోంది.  

ఫంక్షనల్‌ ఫుడ్స్‌ 
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఫంక్షనల్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ ఫుడ్స్‌ 60 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 25 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్‌ సెంథిల్‌ కుమార్‌ చిన్నుసామి విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనుంది. తమిళనాడులోని నమక్కల్, మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో రెండు తయారీ యూనిట్లను నెలకొల్పనుంది. మిగిలిన నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనుంది. అనుబంధ సంస్థ క్రిస్టీ క్వాలిటీ ఫుడ్స్‌(ఇండియా) రుణాలు సైతం తీర్చనుంది. వీటితోపాటు దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు సైతం కేటాయించనుంది. కంపెనీ సమీకృత ఫుడ్‌ కాంట్రాక్ట్‌ తయారీ కంపెనీగా కార్యకలాపాలు విస్తరించింది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్‌ ఉత్పత్తులతోపాటు షుగర్‌ ఆల్టర్నేటివ్స్, స్పైసెస్‌ తదితర 
ప్రొడక్టులను విక్రయిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement