4 ఐపీవోలు.. 2 లిస్టింగ్‌లు: కొత్త షేర్ల ధరలివే.. | IPO Street 4 IPOs Open This Week 2 Stock Market Listings On October 1 | Sakshi
Sakshi News home page

4 ఐపీవోలు.. 2 లిస్టింగ్‌లు: కొత్త షేర్ల ధరలివే..

Sep 28 2026 11:57 AM | Updated on Sep 28 2026 12:24 PM

IPO Street 4 IPOs Open This Week 2 Stock Market Listings On October 1

ఈ వారం సైతం ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. నేడు(28న) రెండు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు తెరలేచింది. ఈ బాటలో ఈ నెల 30న మరో 2 కంపెనీల ఐపీవోలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు గత వారం ఐపీవోలు పూర్తి చేసుకున్న రెండు కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేం​జీలలో లిస్ట్‌కానున్నాయి.               

శ్రిట్‌ ఇండియా @ రూ. 123–130 
ఎస్‌ఆర్‌ఐటీ(శ్రిట్‌) ఇండియా పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 123–130కాగా.. రూ. 218.4 కోట్లు సమీకరించనుంది. గతేడది (2025–26)లో కంపెనీ ఆదాయం దాదాపు రూ. 463 కోట్లకు చేరింది. నికర లాభం రూ. 43 కోట్లను తాకింది.  

షా ఇన్వెస్టర్స్‌ హోమ్‌ @ రూ. 159–167 
షా ఇన్వెస్టర్స్‌ హోమ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 159–167. తద్వారా రూ. 90.2 కోట్లు సమీకరించనుంది. గతేడది (2025–26)లో కంపెనీ ఆదాయం దాదాపు రూ. 72.4 కోట్లకు క్షీణించింది. నికర లాభం సైతం రూ. 13.1 కోట్లకు తగ్గింది.  

విశాల్‌ నిర్మితి @ రూ. 208–220 
విశాల్‌ నిర్మితి పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభమై అక్టోబర్‌ 5న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 208–220కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 145 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 178 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. 2025–26లో ఆదాయం  రూ. 344 కోట్లను దాటింది. నికర లాభం రూ. 25 కోట్లకు చేరింది.  

నిత్యాస్‌ జెమ్స్‌ @ రూ. 70–75 
నిత్యాస్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభమై అక్టోబర్‌ 5న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 70–75. తద్వారా రూ. 108.4 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో కంపెనీ ఆదాయం రూ. 203 కోట్లను అధిగమించింది. నికర లాభం రూ. 22.3 కోట్లను తాకింది.  

రూ. 420 కోట్ల సమీకరణలో ఏస్‌వెక్టార్‌  
డిజిటల్‌ కామర్స్‌ సంస్థ ఏస్‌వెక్టార్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 420 కోట్లు సమీకరిస్తోంది. ఇందుకు సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 30–32. తాజాగా 8.97 కోట్ల షేర్ల జారీ ద్వారా రూ. 287 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 4.16 కోట్లు సమీకరిస్తోంది. కునాల్‌ బెహల్, రోహిత్‌ బన్సాల్‌ స్థాపించిన ఈ సంస్థ ప్రధానంగా స్నాప్‌డీల్, యూనికామర్స్, స్టెలారో బ్రాండ్స్‌ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ ఇష్యూ సెపె్టంబర్‌ 29తో ముగుస్తోంది. మరోవైపు, ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే అగ్రి, సీఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థ గ్రీన్‌ ఏషియా ఇంపెక్స్‌ ఐపీవో ద్వారా రూ. 60.01 కోట్లు సమీకరిస్తోంది. సోమవారంతో ముగిసే ఈ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 85–90గా ఉంది.

అక్టోబర్‌ 1న విడుదల 
ఈ నెల 28న పబ్లిక్‌ ఇష్యూలు ముగించుకున్న మనీ వ్యూ, ఏవన్‌ స్టీల్స్‌ అక్టోబర్‌ 1న స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నాయి. డిజిటల్‌ రుణాల(లెండింగ్‌) ప్లాట్‌ఫామ్‌ మనీవ్యూ రూ. 32–34 ధరల శ్రేణితో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 1,092 కోట్లు సమీకరించింది.  ఇక సమీకృత స్టీల్‌ తయారీ కంపెనీ ఏ–వన్‌ స్టీల్స్‌ ఇండియా రూ. 385–405 ధరల శ్రేణితో రూ. 405 కోట్లు సమకూర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement