ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాల విస్తరణ కోసం భారీ ప్రణాళికల్లో ఉంది. వీటి ప్రకారం రాబోయే ఏడాది వ్యవధిలో 20,000 మందికి పైగా సేల్స్ సిబ్బందిని నియమించుకోనుంది. 50 లక్షలకు పైగా పేమెంట్ డివైజ్‌లను (స్మార్ట్‌స్పీకర్లు, పీవోఎస్ డివైజ్‌లు సహా) ఏర్పాటు చేయనుంది.
వీటిలో సుమారు 50 శాతం పైగా డివైజ్‌లను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది. తద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపు సేవలను మరింతగా అందుబాటులోకి తేనుంది. సరళమైన నిబంధనలతో కొత్త కారి్మక చట్టాలు, పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకునేందుకు దోహదపడతాయని ఫోన్‌పే తెలిపింది.
అలాగే, ఇటీవల ప్రకటించిన ఎండీఆర్ కింద వసూలయ్యే మొత్తంలో 5 శాతాన్ని ప్రత్యేక నిధికి కేటాయించడమనేది చిన్న వ్యాపారుల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు సహాయకరంగా ఉంటుందని వివరించింది.


