ఉద్యోగం మానేస్తే.. హెల్త్ ఇన్సూరెన్స్ పోతుందా? | What Happens to Your Health Insurance After You Quit Your Job, Know The Details | Sakshi
Sakshi News home page

ఉద్యోగం మానేస్తే.. హెల్త్ ఇన్సూరెన్స్ పోతుందా?

Sep 25 2026 5:01 PM | Updated on Sep 25 2026 5:24 PM

What Happens to Your Health Insurance After You Quit Your Job, Know The Details

ఉద్యోగం మారాలని లేదా రాజీనామా చేయాలని అనుకుంటున్నప్పుడు చాలామంది జీతం, నోటీస్ పీరియడ్, కొత్త కంపెనీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ మరో ముఖ్యమైన విషయం మర్చిపోతారు. అదే కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్. ఉద్యోగం వదిలిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ కొనసాగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ.. సాధారణంగా ఉద్యోగం ముగిసిన తర్వాత కంపెనీ హెల్త్ కవర్ కూడా ముగిసిపోతుంది.

ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇన్సూరెన్స్ ఎప్పుడు ముగుస్తుందనేది ప్రతి కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది. కొందరికి చివరి పని రోజు వరకు కవరేజ్ ఉండొచ్చు. మరికొన్ని కంపెనీలు కొంతకాలం అదనంగా కవరేజ్ ఇవ్వొచ్చు. అందుకే రాజీనామా చేసే ముందు హెచ్‌ఆర్‌ను అడిగి ఇన్సూరెన్స్ ఏ తేదీ వరకు ఉంటుందో స్పష్టంగా తెలుసుకోవడం మంచిది.

ఉద్యోగం వదిలిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఉండటం రిస్క్‌తో కూడుకున్న విషయం. అనుకోకుండా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కావచ్చు. అంతేకాదు, కొత్త హెల్త్ పాలసీ తీసుకున్నప్పుడు కొన్ని అనారోగ్యాలకు వెయిటింగ్ పీరియడ్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీ పాలసీ ముగిసే వరకు వేచి ఉండకుండా.. ముందుగానే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించడం మంచిది.

కొన్ని సందర్భాల్లో కంపెనీ ద్వారా ఉన్న గ్రూప్ పాలసీని అదే ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన వ్యక్తిగత పాలసీగా మార్చుకునే అవకాశం ఉండొచ్చు. దీనిని మైగ్రేషన్ అంటారు. అయితే.. దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే భర్త లేదా భార్యకు కంపెనీ ఇన్సూరెన్స్ ఉంటే, వారి పాలసీలో కుటుంబ సభ్యుడిగా చేరే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఉద్యోగం మారే ముందు ఈ ఆప్షన్ల గురించి ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించడం మంచిది.

అలాగే.. కంపెనీ ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉద్యోగం వదిలిన తర్వాత సాధారణంగా ముగిసిపోతుంది. అందుకే కంపెనీ ఇన్సూరెన్స్‌పైనే పూర్తిగా ఆధారపడకుండా, ఉద్యోగం మారే సమయంలో ఆరోగ్య బీమా, జీవిత బీమా రెండింటినీ ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా కుటుంబం మీ ఆదాయంపై ఆధారపడి ఉంటే, ఉద్యోగం మారే ముందు ఇన్సూరెన్స్ కవరేజ్‌లో గ్యాప్ రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఇదీ చదవండి: IRDAI కొత్త రూల్స్.. బీమా కంపెనీలకు కొత్త సవాళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement