ఇక వంట నూనెల ధరలు తగ్గించండి | Revise Edible Oil Prices Govt Asks Companies | Sakshi
Sakshi News home page

ఇక వంట నూనెల ధరలు తగ్గించండి

Sep 25 2026 5:41 PM | Updated on Sep 25 2026 5:56 PM

Revise Edible Oil Prices Govt Asks Companies

వంటనూనెల దిగుమతులపై తగ్గించిన సుంకాల ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తి స్థాయిలో బదిలీ చేయాలని కంపెనీలకు కేంద్ర ఆహార శాఖ సూచించింది. ఇందుకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లకి అందించే ధరలను, గరిష్ట రిటైల్‌ ధరలను (ఎంఆర్‌పీ) సవరించాలని పేర్కొంది. కంపెనీలన్నీ ఈ సూచనలను అమలు చేసేలా చూడాలంటూ వంట నూనెల సంస్థల సంఘాలను ఆదేశించింది.

కేంద్రం బుధవారం ముడి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని (బీసీడీ) 10 శాతం నుంచి సున్నా స్థాయికి, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై 32.5 శాతం నుంచి 22.5 శాతానికి  తగ్గించింది. అలాగే, ముడి సోయాబీన్‌ ఆయిల్, పామాయిల్‌పై బీసీడీ 10 శాతం నుంచి 5 శాతానికి, రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్, పామాయిల్‌పై 32.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గింది. అంతర్జాతీయంగాను, దేశీయంగాను వంట నూనెల మార్కెట్లలో పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తగు చర్యలు తీసుకుంటూ ఉంటుందని ఆహార శాఖ ఒక అధికారిక ప్రకటనలో వివరించింది.

మరోవైపు, దిగుమతి సుంకాల తగ్గింపు నేపథ్యంలో వంట నూనెల రిటైల్‌ ధరలు తగ్గగలవని పరిశ్రమ సంఘం ఐవీపీఏ తెలిపింది. పండుగ సీజన్‌లో డిమాండ్‌కి తగ్గట్లుగా లభ్యత ఉండేలా చూడటానికి ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుందని వివరించింది. భారత్‌ దాదాపు 60 శాతం వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది. అధిక దిగుమతులు, రూపాయి క్షీణత కారణంగా అక్టోబర్‌తో ముగిసే మార్కెటింగ్‌ సంవత్సరంలో వంట నూనెల దిగుమతుల బిల్లుల భారం 9 శాతం ఎగిసి రూ. 1.75 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.

ఇదీ చదవండి: యూపీఐ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చేసిన ఆర్థిక మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement