వంట నూనె ధరలు తగ్గుతాయా? | India Cuts Import Duties on Edible Oils Sunflower Soybean Palm Oil Prices Focus | Sakshi
Sakshi News home page

వంట నూనె ధరలు తగ్గుతాయా?

Sep 24 2026 9:22 AM | Updated on Sep 24 2026 9:22 AM

India Cuts Import Duties on Edible Oils Sunflower Soybean Palm Oil Prices Focus

వంట నూనెల దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించడం ద్వారా దేశీయ మార్కెట్‌లో ధరల ఒత్తిడిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులోభాగంగా ముడి, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్‌, సోయాబీన్‌, పామాయిల్‌ దిగుమతులపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సుంకాల మార్పులు ఆహార ద్రవ్యోల్బణం, వినియోగదారుల వ్యయం, దేశీయ నూనెగింజల రైతుల ప్రయోజనాలపై ప్రభావం చూపే కీలక అంశంగా నిలుస్తున్నాయి.

దిగుమతి ఆధారిత సరఫరా..

భారత్‌ తన వంట నూనెల అవసరాల్లో సుమారు మూడింట రెండొంతుల మేర దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్‌, సోయాబీన్‌ నూనె, సన్‌ఫ్లవర్‌ నూనె ప్రధాన దిగుమతి ఉత్పత్తులుగా ఉన్నాయి. అంతర్జాతీయ ధరలు, సరఫరా అంతరాయాలు, కరెన్సీ మారకం విలువ వంటి అంశాలు దేశీయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దిగుమతి సుంకాల తగ్గింపు అమలైతే దిగుమతిదారుల వ్యయం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయోజనం వినియోగదారులకు పూర్తిగా బదిలీ అవుతుందా అనేది అంతర్జాతీయ ధరలు, రవాణా ఖర్చులు, రూపాయి మారకం విలువ, రిటైల్‌ మార్కెట్‌ పోటీ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

రైతుల ప్రయోజనాలపై దృష్టి

వంట నూనెల దిగుమతి సుంకాల విధానంలో వినియోగదారులకు ధరల ఉపశమనం కల్పించడంతోపాటు దేశీయ నూనెగింజల సాగు, రైతులకు లభించే ధరల పరిరక్షణ మధ్య సమతుల్యత కీలకం. దిగుమతులు చౌకగా మారడం దేశీయ ఉత్పత్తిదారుల ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు గతంలో పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: మల్కాజిగిరి - కామారెడ్డి మధ్య రైల్వే ‘కవచ్ 4.0’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement