జియో ఐపీఓకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ‘ట్రిక్’ వైరల్ అవుతోంది. ఒకే డీమ్యాట్ ఖాతా నుంచి ఐపీఓకు రెండుసార్లు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కొనుగోలు చేస్తే జియో ఐపీఓలో వాటాదారుల రిజర్వేషన్ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారం ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు జియో ఐపీఓలో షేర్‌హోల్డర్ రిజర్వేషన్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో.. సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలో కూడా మరో దరఖాస్తు చేసుకోవచ్చని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి.
ఇలాంటి విధానాన్ని గతంలో కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, ఎన్‌ఎల్‌సీ ఇండియా వంటి సంస్థల ఐపీఓల సమయంలో ఇన్వెస్టర్లు ఉపయోగించినట్లు ఈ ప్రచారంలో పేర్కొంటున్నారు.
అయితే.. ఒకే డీమ్యాట్ ఖాతా లేదా ఒకే పాన్ నుంచి రెండు వేర్వేరు కేటగిరీల్లో దరఖాస్తు చేయడం అనుమతించబడుతుందా? అనే విషయం ఐపీఓ అధికారిక నిబంధనలు, SEBI మార్గదర్శకాలు మరియు జియో ఐపీఓ తుది ఆఫర్ డాక్యుమెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, జియో ఐపీఓకు దరఖాస్తు చేసే ముందు అధికారిక ఐపీఓ డాక్యుమెంట్లలో వాటాదారుల రిజర్వేషన్, అర్హత తేదీ, దరఖాస్తు పరిమితులు, ఒకే PAN/డీమ్యాట్ ఖాతాకు వర్తించే నిబంధనలను ఇన్వెస్టర్లు పరిశీలించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ఉద్యోగం మానేస్తే.. హెల్త్ ఇన్సూరెన్స్ పోతుందా?


