జియో కొత్త ఆఫర్.. అమెజాన్ ప్రైమ్ లైట్ ఉచితం! | Reliance Jio Offers One Year Amazon Prime Lite Plan For Free to JioHome Fiber Subscribers | Sakshi
Sakshi News home page

జియో కొత్త ఆఫర్.. అమెజాన్ ప్రైమ్ లైట్ ఉచితం!

Sep 21 2026 5:23 PM | Updated on Sep 21 2026 5:50 PM

Reliance Jio Offers One Year Amazon Prime Lite Plan For Free to JioHome Fiber Subscribers

రిలయన్స్ జియో తన 10వ వార్షికోత్సవం సందర్భంగా జియోహోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం ఓ కొత్త ఆఫర్ ప్రకటించింది. 30Mbps, 100Mbps వేగంతో కూడిన 3-in-1 జియోహోమ్ ప్లాన్లు ఉపయోగిస్తున్న ఎంపిక చేసిన కస్టమర్లకు ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను పొందేందుకు అర్హత ఉన్న వినియోగదారులు మైజియో యాప్‌లో కనిపించే ఆఫర్ బ్యానర్‌పై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఈ ఆఫర్‌ను వచ్చే రెండు వారాల్లో దశలవారీగా కంపెనీ అందించనుంది. అయితే రూ.888, రూ.1,199తో పాటు 150Mbps లేదా అంతకంటే ఎక్కువ వేగం ఉన్న ప్లాన్లను ఉపయోగిస్తున్న వారికి ఇప్పటికే ఉన్న 24 నెలల అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనం కొనసాగుతుంది.

రూ.3,599 ప్రీపెయిడ్ ప్లాన్‌
జియో తన 10వ వార్షికోత్సవం సందర్భంగా మరికొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. రూ.3,599 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు జియో హాట్‌స్టార్, జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్, జియో టీవీ ప్రో వంటి ప్రయోజనాలు అందిస్తోంది. అంతే కాకుండా.. గూగుల్ జెమిని ప్రో ప్రయోజనాన్ని మరింత కాలం పాటు అందించడంతో పాటు 5TB గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, కొత్త ఏఐ ఫీచర్లు, గూగుల్ ఫ్లో, యూట్యూబ్ ప్రీమియం లైట్ వంటి సదుపాయాలు కూడా ఆఫర్లలో ఉన్నాయి.

కాన్వా ఉచితం
రూ.399 ప్లాన్ వినియోగదారులకు 12 నెలల కాన్వా ప్రో ఉచితంగా లభిస్తుంది. దీని విలువ సుమారు రూ.4,000 ఉంటుందని సమాచారం. అలాగే రూ.349తో పాటు రోజుకు 2GB డేటా లభించే ఇతర ప్రీపెయిడ్ ప్లాన్లలో 12 నెలల కాన్వా ప్రో లైట్ ఉచితంగా అందిస్తోంది.

కాన్వా ద్వారా విద్యార్థులు స్కూల్ ప్రాజెక్టులు, ఉద్యోగులు ఆఫీస్ ప్రెజెంటేషన్లు, సాధారణ వినియోగదారులు పండుగ శుభాకాంక్షల కార్డులు వంటి వాటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఇప్పటికే సిద్ధంగా ఉన్న అనేక టెంప్లేట్లు ఉండటంతో కొత్తగా ఉపయోగించే వారికి కూడా డిజైన్లు తయారు చేయడం సులభంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement