ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ కొత్తగా రెండు ఫండ్స్‌ను ఆవిష్కరించింది. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ న్యూ ఫండ్ ఆఫర్స్ (ఎన్‌ఎఫ్‌వో) సెప్టెంబర్ 29 వరకు అందుబాటులో ఉంటాయి. వీటిలో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ విధానంలో వ్యవధిని బట్టి రూ. 20 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ అనేది నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్‌కి అనుగుణమైన ఈక్విటీలు, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక కెమికల్ ఇండెక్స్ ఫండ్ అనేది నిఫ్టీ కెమికల్ ఇండెక్స్‌కి అనుగుణమైన ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ప్యాసివ్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తుంది.
కోటక్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్ ఫండ్
ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం, పెట్టుబడి పెట్టేందుకు అనువైన సాధనాలు పెరుగుతుండటంలాంటి సానుకూలాంశాలతో గత కొన్నేళ్లుగా దేశీయ క్యాపిటల్ మార్కెట్ల వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. దీనితో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఎక్సే్చంజీలు, బ్రోకింగ్ సంస్థలు మొదలైన వివిధ విభాగాలవ్యాప్తంగా పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే వీటిలో ప్యాసివ్‌గా ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పడేలా కోటక్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది కోటక్ మహీంద్రా ఏఎంసీ. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుందని ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి తెలిపారు. ఈ ఫండ్ సెప్టెంబర్ 29తో ముగుస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.


