మ్యూచువల్‌ ఫండ్స్‌.. ‘కొత్త ఆఫర్స్‌’ | Mutual Fund New Offers Axis Kotak Mahindra JioBlackRock New Funds | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌.. ‘కొత్త ఆఫర్స్‌’

Sep 14 2026 2:52 PM | Updated on Sep 14 2026 3:44 PM

Mutual Fund New Offers Axis Kotak Mahindra JioBlackRock New Funds

ధరలపరంగా ఒడిదుడుకులు తక్కువగా ఉండే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలు కల్పించేలా ‘యాక్సిస్‌ నిఫ్టీ500 లో వోలటైలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌’ను యాక్సిస్‌ మూచువల్‌ ఫండ్‌ ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ సెప్టెంబర్‌ 22 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. నిఫ్టీ500 నుంచి ఎంపిక చేసిన 50 షేర్ల సూచీ దీనికి ప్రామాణికంగా ఉంటుంది. రంగాలు, మార్కెట్‌ క్యాపిటలైజేషన్స్‌వ్యాప్తంగా డైవర్సిఫికేషన్‌ను పాటిస్తూనే, మిగతా వాటితో పోలిస్తే ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోను కాని స్టాక్స్‌ ఇందులో ఉంటాయి. ప్రతి ఆరు నెలలకోసారి మార్కెట్‌ పరిస్థితులను బట్టి సూచీని రీబ్యాలెన్స్‌ చేస్తారు. సరళమైన, పారదర్శకమైన ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌ వ్యూహంతో కొంత స్థిరంగా ఉండే కంపెనీల పోర్ట్‌ఫోలియో ద్వారా మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువుగా ఉంటుంది.  

కోటక్‌ మల్టీ సెక్టార్‌ ఆమ్ని ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌

ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌ స్కీముల్లో ఇన్వెస్ట్‌ చేసే మల్టీ సెక్టార్‌ ఆమ్ని ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ సెపె్టంబర్‌ 22 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రాథమికంగా సిప్‌ విధానంలో రూ. 500 నుంచి, నాన్‌–సిప్‌ విధానంలో రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. రూ. 1,000 నుంచి (నాన్‌–సిప్‌), సిప్‌  మారే ఆర్థిక, మార్కెట్‌ పరిస్థితులను బట్టి వివిధ రంగాల్లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా పెట్టుబడులను రీబ్యాలెన్స్‌ చేసుకునే వెసులుబాటుని ఈ ఫండ్‌ అందిస్తుంది. మారే పరిస్థితులను బట్టి అప్పటివరకు నాయకత్వ స్థానంలో ఉండే రంగాలూ మారిపోతుంటాయని కంపెనీ ఎండీ నీలేష్‌ షా తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకే సొల్యూషన్‌ ద్వారా బహుళ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఎఫ్‌వోఎఫ్‌ ఉపయోగపడుతుందన్నారు.  

జియోబ్లాక్‌రాక్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌

ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో పెట్టుబడుల ప్రయోజనాలను అందించేలా జియోబ్లాక్‌రాక్‌ ఏఎంసీ సంస్థ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌  సెప్టెంబర్‌ 25తో ముగుస్తుంది. మారే పరిస్థితులకు అనుగుణంగా, ఈక్విటీలు, డెట్‌ సాధనాలకు కేటాయింపులను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందించేందుకు ఇది ప్రయథ్‌త్నిస్తుంది. అవసరమైతే డెరివేటివ్స్‌ సాధనాలను కూడా ఉపయోగించవచ్చు. ప్రామాణిక సూచీతో పోలిస్తే 3–4 శాతం అధిక రాబడులు అందించడం దీని లక్ష్యం. అన్ని ఫండ్స్‌వ్యాప్తంగా ప్రస్తుతం రూ. 22,000 కోట్లుగా ఉన్న ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం)ను 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000 కోట్లకు చేర్చుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement