రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.111 కూడా ఒకటి. ఇది ఒక ఫ్లెక్స్ యూత్ అండ్ గేమింగ్ ప్యాక్. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో మొత్తం 5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 28 రోజుల సమయంలో 5జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చన్నమాట.
ఈ ప్యాక్‌లో మరో ప్రత్యేకమైన బెనిఫిట్ కూడా ఉంది. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్‌ను మీరు ఎంచుకోవచ్చు.
గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్లు గేమింగ్ ప్యాక్ ఎంచుకోవచ్చు. దీనిలో జియో గేమ్ మొబైల్‌కు 56 రోజుల యాక్సెస్ లభిస్తుంది. మరోవైపు యూత్ ప్యాక్ ఎంచుకుంటే.. జియో గేమ్ మొబైల్‌తో పాటు, ఫ్యాన్ కోడ్, స్నాప్‌చాట్ ప్లస్ కూడా లభిస్తాయి. ఈ ఆప్షన్ వ్యాలిడిటీ 28 రోజులు.
అయితే.. ఈ బెనిఫిట్స్ పొందాలంటే మైజియోలో ఇచ్చే ఓచర్‌ను రీడీమ్ చేసుకోవాలి. రీచార్జ్ చేసిన తేదీ నుంచి 28 రోజుల్లోపు ఓచర్‌ను రీడీమ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎంచుకున్న బెనిఫిట్ యాక్టివేట్ అవుతుంది.
మొత్తం మీద ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 5జీబీ డేటాతో పాటు, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. గేమింగ్ ఎక్కువగా చేసే వాళ్లకు గేమింగ్ ప్యాక్, సోషల్ మీడియా, స్పోర్ట్స్, గేమింగ్ ఇష్టపడే వాళ్లకు యూత్ ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది.


