జియో రూ.77 రీచార్జ్‌ ప్లాన్ గురించి తెలుసా? | Reliance Jio Rs 77 Plan Detailes | Sakshi
Sakshi News home page

జియో రూ.77 రీచార్జ్‌ ప్లాన్ గురించి తెలుసా?

Sep 6 2026 1:42 PM | Updated on Sep 6 2026 1:47 PM

Reliance Jio Rs 77 Plan Detailes

రిలయన్స్ జియో వినియోగదారుల కోసం రూ. 77 ప్రీపెయిడ్ ప్లాన్‌ అందిస్తోంది. ఇది ఒక డేటా వోచర్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దీనితో పాటు ఓటీటీ ప్రయోజనం కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జియో రూ.77 ప్లాన్ అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఓటీటీ ప్రయోజనాలను అందించడమే. ఎందుకంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కేవలం 3 జేబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇది కూడా కేవలం 5 రోజుల వ్యాలిడిటీ మాత్రమే.

సోనీలివ్ ఓటీటీ 30 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. సోనీలివ్ ద్వారా కంటెంట్‌ను చూడటానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా దానిని స్ట్రీమ్ చేసుకోవచ్చు. జియోటీవీ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

రూ.55 ప్లాన్
తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండే టీవీ ఛానెళ్లను చూడాలనుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియో బడ్జెట్-ఫ్రెండ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ ప్రవేశపెట్టింది. కేవలం రూ. 55 ధరతో లభించే జియోటీవీ ప్రో ప్యాక్, 30 రోజుల వ్యాలిడిటీతో పాటు, జియోటీవీ యాప్ ద్వారా 16కు పైగా భాషలలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

టీవీ ఛానెల్‌లతో పాటు, జియోటీవీ ప్రో ప్లాన్‌లో మొత్తం 3MB డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ కేవలం మూడు రోజులు మాత్రమే. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి వాయిస్ కాలింగ్ సదుపాయం లభించదు. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ మాత్రమే.

ఇదీ చదవండి: ఖాతాదారులకు అలర్ట్‌: 3 రోజులు బ్యాంకులు బంద్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement