డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. తప్పకుండా బ్యాంకులకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. అయితే ప్రతి నెల, ప్రతి వారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కాబట్టి బ్యాంకులకు వెళ్లి ఏదైనా పనులు చేయాలనుకునే వారు ఈ హాలిడేస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ కథనంలో వచ్చే వారం (సెప్టెంబర్ 7 నుంచి 13వరకు)లో ఎన్ని సెలవులు ఉన్నాయో చూసేద్దాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం.. దేశంలోని బ్యాంకులకు ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. అలాగే ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. కాబట్టి సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు మూడు రోజులు బ్యాంకులకు సెలవు ఉన్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 11, శుక్రవారం: జైపూర్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఢిల్లీలో కూడా బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతో ఢిల్లీలోని కొన్ని బ్యాంకులపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 12, శనివారం: రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. అదే రోజున కొన్ని ప్రాంతాల్లో స్థానిక పండుగ కారణంగా కూడా బ్యాంకులు మూసి ఉంటాయి.
సెప్టెంబర్ 13, ఆదివారం: సాధారణ వారాంతపు సెలవు.
బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ కస్టమర్లకు అన్ని బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోవు. యూపీఐ, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగానే అందుబాటులో ఉంటాయి. అందువల్ల డబ్బు బదిలీ చేయడం, ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వంటి పనులను ఇంటి నుంచే చేసుకోవచ్చు.


