ఖాతాదారులకు అలర్ట్.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్! | Bank Holidays: Banks to Remain Closed from August 30 to September 5 | Sakshi
Sakshi News home page

Bank Holidays 2026: ఖాతాదారులకు అలర్ట్.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్!

Aug 30 2026 12:21 AM | Updated on Aug 30 2026 12:41 AM

Bank Holidays: Banks to Remain Closed from August 30 to September 5

డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ బ్యాంకులకు వెళ్లి కొన్ని పనులను పూర్తిచేసుకుని ఖాతాదారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ప్రతి నెల, ప్రతి వారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కాబట్టి బ్యాంకులకు వెళ్లి ఏదైనా పనులు చేయాలనుకునే వారు ఈ హాలిడేస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

బ్యాంకు సెలవులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించే హాలిడే క్యాలెండర్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. అందుకే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లే ముందు సెలవు ఉందో లేదో తెలుసుకుంటే సమయం వృథా కాకుండా ఉంటుంది.

ఆగస్టు 30న బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. దీంతో ఆ రోజు బ్యాంకు బ్రాంచ్‌లు పనిచేయవు. అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఏం వంటి డిజిటల్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి.

సెప్టెంబర్ 4న జన్మాష్టమి సెలవు
సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే.. బ్యాంకు సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. కాబట్టి బ్రాంచ్‌కు వెళ్లే ముందు స్థానిక బ్యాంకు నుంచి సమాచారం తెలుసుకోవడం మంచిది.

సెప్టెంబర్ 5న బ్యాంకులు పనిచేస్తాయి
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉన్నప్పటికీ బ్యాంకులకు సెలవు లేదు. RBI హాలిడే క్యాలెండర్ ప్రకారం ఆ రోజు బ్యాంకులు సాధారణంగానే పనిచేస్తాయి. దీంతో ఖాతాదారులు తమ బ్యాంకింగ్ పనులను యథావిధిగా పూర్తి చేసుకోవచ్చు.

ఈ తేదీల్లో బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి
ఆగస్టు 31 సోమవారం, సెప్టెంబర్ 1 మంగళవారం, సెప్టెంబర్ 2 బుధవారం, సెప్టెంబర్ 3 గురువారం బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఖాతాదారులు బ్యాంకు బ్రాంచ్‌లను సందర్శించి తమ పనులు పూర్తి చేసుకోవచ్చు.

సెప్టెంబర్‌లో మొత్తం 14 రోజులు సెలవులు
సెప్టెంబర్ నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు మొత్తం 14 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. ఇందులో శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి వంటి పండుగలతో పాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. ముందు చెప్పుకున్నట్లుగా.. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. రాష్ట్రాన్ని బట్టి సెలవుల సంఖ్య, తేదీల్లో మార్పులు ఉండొచ్చు. అందుకే బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లే ముందు సెలవు వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement