చిన్న బ్యాంకుల విలీనం.. పెద్ద బ్యాంకుల ఏర్పాటు! | India May Merge Smaller Banks to Create Larger Lenders EAC PM Proposal | Sakshi
Sakshi News home page

చిన్న బ్యాంకుల విలీనం.. పెద్ద బ్యాంకుల ఏర్పాటు!

Aug 27 2026 5:06 AM | Updated on Aug 27 2026 5:06 AM

India May Merge Smaller Banks to Create Larger Lenders EAC PM Proposal

పలు చిన్న బ్యాంకులను విలీనం చేసి కొన్ని భారీ బ్యాంకులను ఏర్పాటు చేయడంపై భారత్‌ దృష్టి పెట్టాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) ఒక చర్చాపత్రంలో ప్రతిపాదించింది. అదే సమయంలో మార్కెట్లో పోటీ తగ్గిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 2017లో ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులను, 2019లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా-విజయ బ్యాంక్‌-దేనా బ్యాంకులను, 2020లో 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కన్సాలిడేట్‌ చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి తగ్గిందని వివరించింది.

కన్సాలిడేషన్‌ వల్ల స్థాయి, కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాలు పెరిగాయని ఈఏసీ–పీఎం తెలిపింది. దేశీ బ్యాంకింగ్‌ రంగంలో సమర్ధత, ఉత్పాదకతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయని పేర్కొంది. భవిష్యత్తులో కృత్రిమ మేథ (ఏఐ), బ్యాంక్‌ డిజిటైజేషన్‌ కూడా కలిస్తే సమర్ధత మరింతగా పెరుగుతుందని వివరించింది. 2015–2026 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో (12 ఏళ్లు) 47 బ్యాంకులను అధ్యయనం చేసిన మీదట ఈఏసీ-పీఎం ఈ పత్రాన్ని రూపొందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement