SBI స్కీమ్.. డబ్బు దాచుకోవడానికి మంచి మార్గం! | SBI 444 Days FD Earn Attractive Interest with Amrit Vrishti Scheme | Sakshi
Sakshi News home page

SBI స్కీమ్.. డబ్బు దాచుకోవడానికి మంచి మార్గం!

Sep 6 2026 6:54 AM | Updated on Sep 6 2026 7:02 AM

SBI 444 Days FD Earn Attractive Interest with Amrit Vrishti Scheme

డబ్బును సురక్షితంగా దాచుకోవాలని భావించే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఒక మంచి మార్గం. ముఖ్యంగా.. మార్కెట్‌లో వచ్చే హెచ్చుతగ్గుల గురించి ఆందోళన చెందకుండా, స్థిరమైన వడ్డీ పొందాలనుకునేవారు ఎఫ్‌డీలను ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అందిస్తున్న 'అమృత్ వృష్టి' అనే 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ పెట్టుబడిదారుల దృష్టిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే.. మంచి వడ్డీ రేటును పొందే అవకాశం ఉంది.

ఈ స్కీమ్‌లో కస్టమర్ వర్గాన్ని బట్టి వడ్డీ రేట్లు మారుతాయి. సాధారణ కస్టమర్లకు 6.45 శాతం, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే.. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ ఎఫ్‌డీ కాలపరిమితి 444 రోజులు అంటే సుమారు 14.5 నెలలు మాత్రమే.

అమృత్ వృష్టి ఎఫ్‌డీలో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారులు తమ అవసరాన్ని బట్టి వడ్డీని నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధసంవత్సర ప్రాతిపదికన పొందే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయంలో ఎఫ్‌డీపై లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. అలాగే అవసరమైతే గడువు పూర్తికాకముందే ఎఫ్‌డీను క్లోజ్ చేసి డబ్బు తీసుకోవచ్చు.

ఈ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా సులభం. ఎస్‌బీఐ కస్టమర్లు యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా అమృత్ వృష్టి ఎఫ్‌డీను ప్రారంభించవచ్చు. తక్కువ కాలంలో స్థిరమైన రాబడి పొందాలని భావించే వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, ఈ ఎఫ్‌డీ ఒక మంచి పెట్టుబడి ఎంపిక. అయితే పెట్టుబడి పెట్టే ముందు SBIలో ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లు, నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఇదీ చదవండి: మనశ్శాంతి కోసం జాబ్ మానేసి.. నెలకు రూ.కోటి టర్నోవర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement