ఆడి కొత్త మోడల్‌.. ఆవిష్కరించిన హీరో సుమంత్‌ | Actor Sumanth Unveil Audi New Q3 in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆడి కొత్త మోడల్‌.. ఆవిష్కరించిన హీరో సుమంత్‌

Sep 5 2026 9:12 PM | Updated on Sep 5 2026 9:12 PM

Actor Sumanth Unveil Audi New Q3 in Hyderabad

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆడి సెంట్రల్‌ షోరూమ్‌లో ఆడి ఇండియా కొత్త క్యూ3 మోడల్‌ కారును ప్రముఖ హీరో సుమంత్‌ ఆవిష్కరించారు. శనివారం ఆడి సెంట్రల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో సుమంత్‌ మాట్లాడుతూ.. వీవీసీ గ్రూప్‌తో తనకు ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆడి క్యూ3 మోడల్‌ అద్భుతంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం వాహనాల్లో క్యూ3 ఒకటిగా నిలవనుందని అన్నారు. సరికొత్త డిజైన్‌, ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన న్యూ క్యూ3 కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వీవీసీ గ్రూప్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో న్యూ క్యూ3 మోడల్‌ను అధికారికంగా లాంచ్‌ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని, వచ్చే నెల నుంచి వాహనాల డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

సరికొత్త ఫీచర్లు, అధునాతన సాంకేతికతతో న్యూ క్యూ3 వినియోగదారుల ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ వాహనానికి ఇప్పటికే అద్భుతమైన స్పందన లభిస్తోందని, ఆల్‌ ఇండియా స్థాయిలోనూ భారీగా బుకింగ్స్‌ వస్తున్నాయని చెప్పారు. ఆడి న్యూ క్యూ3కు వినియోగదారుల నుంచి లభిస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీవీసీ గ్రూప్‌ డైరెక్టర్లు విశాల్‌ చౌదరి, వికాస్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement