ఇరువర్గాలుగా విడిపోయిన విద్యార్థులు
పరస్పర దాడులు.. పలువురికి గాయాలు
హైదరాబాద్: జేఎన్టీయూహెచ్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. హాస్టల్ గదుల్లో దాక్కున్న విద్యార్థులను తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి దాడి చేశారు. బుధవారం రాత్రి తీజ్ వేడుకల్లో మధ్య తలెత్తిన వివాదంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ విద్యార్థి మరో విద్యార్థిని ప్రవర్తన మార్చుకోవాలని చెప్పడంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. వీరికి మిగతా విద్యార్థులు సర్ది చెప్పి పంపించారు.
ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వా గౌతమి, మంజీరా హాస్టళ్ల వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున చేరి పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ వేరే హాస్టళ్ల గదులకు వెళ్లిపోయారు. వర్సిటీ సిబ్బంది సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణకు కారకులైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ జీవీ నరసింహారెడ్డి చెప్పారు.
విచారణ చేస్తున్నాం: డీసీపీ
జేఎన్టీయూహెచ్‌లో గొడవకు కారణమైన ఇరువర్గాల విద్యార్థులపై కేసులు నమోదు చేయడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. శుక్రవారం ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. వర్సిటీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ నిర్వాహకులను, ఇతర సిబ్బందితో విచారణ చేపట్టినట్టు తెలిపారు. ర్యాగింగ్ కారణంగా గొడవ జరిగిందనే విషయం వాస్తవం కాదన్నారు.
కేసులు ఇలా..
కాట్రావత్ నవీన్ నాయక్ ఫిర్యాదు మేరకు రాజు, ఆనంద్, వసంత్, దుర్గా ప్రసాద్, ఆదిత్య, సాగర్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదే విధంగా వసంత్‌నాయక్ ఫిర్యాదు మేరకు నవీన్ నాయక్, ప్రశాంత్, సందీప్, ఇస్మాయిల్, వెంకట్, చక్రి, సాత్విక్, ప్రకాష్‌లపై కేసులు నమోద య్యాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్, సందీప్, పూజిత్, రాజే‹Ù, సన్నీ, ఇస్మాయిల్, ఇమ్మాన్యుయేల్‌లపై కేసులు నమోదు చేశారు.


