మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరులపై అథ్లెట్‌ ఫిర్యాదు | Athlete Pratibha Complaint On Srinivas Goud | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరులపై అథ్లెట్‌ ఫిర్యాదు

Sep 5 2026 12:36 PM | Updated on Sep 5 2026 12:43 PM

Athlete Pratibha Complaint On Srinivas Goud

హైదరాబాద్‌: మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌పై ఆరోపణలు చేసిన అంతర్జాతీయ అథ్లెట్‌ తక్కళ్లపల్లి ప్రతిభ శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాస్‌ గౌడ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో తనను ఉద్దేశపూర్వకంగా ట్రోల్‌ చేస్తూ, కించపరిచేలా పోస్టులు, సందేశాలు పెడుతున్నారని ఆరోపించారు. 

తనను అవమానించేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరించే ధోరణిలోనూ సందేశాలు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అనంతరం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల శ్రీనివాస్‌ గౌడ్‌పై తాను చేసిన ఆరోపణల నేపథ్యంలోనే సోషల్‌ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్‌ చేస్తున్నారని ప్రతిభ ఆరోపించారు.  

చదవండి: తెలంగాణలోనూ అలా గెలవాలన్నది బీజేపీ ప్లాన్‌: రేవంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement