చిన్నారి ఎక్కడ? అని అడిగితే.. భార్యపై భర్త పైశాచికం! | Hyderabad Dowry Harassment Husband Sets Wife On Fire | Sakshi
Sakshi News home page

చిన్నారి ఎక్కడ? అని అడిగితే.. భార్యపై భర్త పైశాచికం!

Sep 5 2026 2:31 PM | Updated on Sep 5 2026 2:39 PM

Hyderabad Dowry Harassment Husband Sets Wife On Fire

అదనపు కట్నం కోసం వేధింపులు

హైదరాబాద్‌: అదనపు కట్నం కోసం వేధిస్తూ.. ఓ భర్త...భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. మల్లాపూర్‌కు చెందిన  లాలుతో 2023లో చెంగిచెర్లకు చెందిన రత్నావత్‌ అనిత (21)కు ప్రేమవివాహం జరిగింది.

వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది.  రెండు నెలలుగా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో అనిత నెలరోజుల క్రితం  ఆర్టీసీ కాలనీలోని తన పుట్టింటికి వెళ్లింది.  ఈ నెల 2న లాలు వచ్చి కుమార్తెను తీసుకెళ్లాడు. మళ్లీ  3న  చెంగిచెర్లకు వచ్చాడు. అయితే కూతురిని తీసుకురాలేదు.

మనవరాలు ఎక్కడ ఉందని అనిత తండ్రి లాలుని ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను అనితపై పోసి నిప్పంటించాడు. కుమార్తెను రక్షించేందుకు అనిత తల్లి ప్రయత్నించే క్రమంలో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. బయట ఉన్న అనిత తండ్రి కేకలు విని వెంటనే వచ్చి మంటలను ఆర్పి, అనంతరం 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి: తీజ్‌ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్‌లో కర్రలతో దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement