ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Thudakkam Movie OTT Release Date Latest Update | Sakshi
Sakshi News home page

Thudakkam OTT: మోహన్ లాల్ కూతురి తొలి మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

Sep 6 2026 8:36 AM | Updated on Sep 6 2026 9:01 AM

Thudakkam Movie OTT Release Date Latest Update

మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఇప్పటికే వరస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈయన కొడుకు ప్రణవ్ ఇప్పటికే హీరోగా పలు చిత్రాలు చేశాడు. రీసెంట్‌గా మోహన్ లాల్ కూతురు విస్మయ కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ఈమె ప్రధాన పాత్రలో చేసిన మూవీ థియేటర్లలోకి వచ్చి హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

విస్మయ మోహన్ లాల్ లీడ్ రోల్ చేసిన సినిమా 'తుడక్కం'. సర్వైవల్ థ్రిల్లర్ కథతో దీనిని తెరకెక్కించారు. '2018' మూవీతో జాతీయ అవార్డ్ దక్కించుతున్న జూడ్ ఆంటోని జోసెఫ్ దీనికి దర్శకుడు. ఆగస్టు 7న మలయాళం వరకు థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

'తుడక్కం' విషయానికొస్తే.. మీను (విస్మయ మోహన్ లాల్) తన తండ్రితో కలిసి ఓ కొత్త ప్రాంతానికి మారుతుంది. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన మీను.. ఓ రోజు రాత్రి ఇద్దరు స్కూల్ అమ్మాయిలని ఆపద నుంచి కాపాడుతుంది. ఈ క్రమంలోనే ఓ ప్రమాదకర వ్యక్తి(ఆశిష్ జో ఆంటోనినీ)తో ఈమెకు శత్రుత్వం ఏర్పడుతుంది. తర్వాత ఈమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా తప్పించుకుందనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement