breaking news
Thudakkam Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. అలానే మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ముఖ్యంగా 'హనుమాన్ అంశ్' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే హిందీలో అద్భుతమైన కలెక్షన్లతో అదరగొడుతున్న చిత్రం తెలుగులో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)హనుమాన్ అంశ్(తెలుగు)తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా '418', కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లో 24 వరకు మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రీసెంట్ సెన్సేషనల్ హిట్ 'ఇరుముడి', మొదరాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లాంటి డబ్బింగ్ బొమ్మలు చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 14 నుంచి 20 వరకు)నెట్ఫ్లిక్స్ద డాల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16మాన్స్టర్: ద లిజీ బోర్డెన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17నాట్ ఏ స్ట్రేంజర్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17ప్లాస్టిక్ బ్యూటీ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 17స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17ఇరుముడి (తెలుగు సినిమా) - సెప్టెంబరు 18లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 18బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 18మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ చిత్రం) - సెప్టెంబరు 18ద స్కాండల్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 18జాకీర్ ఖాన్: పాప యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో) - సెప్టెంబరు 18ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వివో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 20అమెజాన్ ప్రైమ్ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 15 (రెంట్)నీగ్లే (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16వెయిటింగ్ హై (హిందీ సిరీస్) - సెప్టెంబరు 16రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) - సెప్టెంబరు 18యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18హాట్‌స్టార్78th ఎమ్మీ అవార్డ్స్ (అవార్డ్ షో) - సెప్టెంబరు 15లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 17తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్అంగీకారం (తమిళ మూవీ) - సెప్టెంబరు 18ఆపిల్ టీవీ ప్లస్స్లో హార్సెస్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఇప్పటికే వరస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈయన కొడుకు ప్రణవ్ ఇప్పటికే హీరోగా పలు చిత్రాలు చేశాడు. రీసెంట్గా మోహన్ లాల్ కూతురు విస్మయ కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ఈమె ప్రధాన పాత్రలో చేసిన మూవీ థియేటర్లలోకి వచ్చి హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)విస్మయ మోహన్ లాల్ లీడ్ రోల్ చేసిన సినిమా 'తుడక్కం'. సర్వైవల్ థ్రిల్లర్ కథతో దీనిని తెరకెక్కించారు. '2018' మూవీతో జాతీయ అవార్డ్ దక్కించుతున్న జూడ్ ఆంటోని జోసెఫ్ దీనికి దర్శకుడు. ఆగస్టు 7న మలయాళం వరకు థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'తుడక్కం' విషయానికొస్తే.. మీను (విస్మయ మోహన్ లాల్) తన తండ్రితో కలిసి ఓ కొత్త ప్రాంతానికి మారుతుంది. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన మీను.. ఓ రోజు రాత్రి ఇద్దరు స్కూల్ అమ్మాయిలని ఆపద నుంచి కాపాడుతుంది. ఈ క్రమంలోనే ఓ ప్రమాదకర వ్యక్తి(ఆశిష్ జో ఆంటోనినీ)తో ఈమెకు శత్రుత్వం ఏర్పడుతుంది. తర్వాత ఈమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా తప్పించుకుందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)


