బేబీ మూవీతో ఫేమస్ అయిన టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ ఈ చిత్రానికి ఆదిత్యహాసన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నటుడు శివాజీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఎక్కువ మంది చదివింది: 100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి: అల్లరి నరేష్
ఆ కిక్కే వేరు..
‘సినిమా అనేది ఒక అద్భుతం. ఇది థియేటర్లలో మాత్రమే చూడాలి. 200 నుంచి 300 మంది మధ్య ఓ సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. అంతేకాని ఓటీటీలో చూస్తూ.. జోమోటో వాడు వచ్చాడు.. స్విగ్గివాడు వచ్చాడని మూవీని ఆపి చూస్తే అంత మజా అనిపించదు. ఓటీటీ అనేది బాగా ఖాళీ ఉండి.. సోమరిబోతుల కోసం మాత్రమే. అని శివాజీ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా తాను నటించిన ‘90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ థియేటర్లలో రిలీజ్ అయింటే కచ్చితంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసేదన్నారు. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి. నెటిజన్ల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సినిమా విషయానికి వస్తే..
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఈ రోజు (సెప్టెంబర్ 4)న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా రష్మిక హాజరుకానున్నారు.
ఇదీ చదవండి: అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం
Shocking Comments 😲
Actor #Sivaji about #90sWebSeries
“OTT is for LAZY PEOPLE!!”
If #90s had released in theatres, the film would have easily crossed ₹100 CR, according to Sivaji.
pic.twitter.com/Wyrn4vJLHD— Milagro Movies (@MilagroMovies) September 3, 2026


