జూ. ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్‌ | Bollywood stars queue up for Jr NTR Dragon Movie | Sakshi
Sakshi News home page

జూ. ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్‌

Sep 3 2026 11:44 PM | Updated on Sep 3 2026 11:49 PM

Bollywood stars queue up for Jr NTR Dragon Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అనీల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోకి మరో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ‘డ్రాగన్’లో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నాడట. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అలియా భట్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. నిజానికి డ్రాగన్ సినిమాలోకి అలియాను తీసుకుంటారనే ప్రచారం ఏడాది కిందటే నడిచింది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. మరో రెండు వారాల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎలాంటి బ్రేకులు లేకుండా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి చిత్రీకరణను ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. కాగా.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్‌ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement